Last Updated on by
జాన్వీ నటించిన `ధడక్` ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం రిలీజైంది. తొలి రెండు రోజుల్లోనే ఇండియా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 20కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. తొలి వీకెండ్ నాటికి ఏకంగా 30కోట్ల వసూళ్లు దక్కుతాయని అంచనా వేశారు. ఇక విదేశాల నుంచి ధడక్ రిపోర్ట్ ఘనంగానే ఉంది.
ధడక్ అమెరికా సహా ఓవర్సీస్ బాక్సాఫీస్ నుంచి 6కోట్లు (858కె డాలర్లు) వసూలు చేసి సత్తా చాటింది. ఈ ఓపెనింగులతో ఇంటా బయటా జాన్వీ హవా సాగిందనే చెప్పాలి. అతిలోక సుందరి శ్రీదేవి మరణానంతరం జాన్వీ నటించిన సినిమా రిలీజవ్వడం, అటుపై శ్రీదేవి అభిమానుల్లో సింపథీ ఇవన్నీ ఈ సినిమా కలెక్షన్లకు సాయం అయ్యాయి. అలానే ఈ చిత్రం కథ పరంగా రొటీన్‌గానే ఉన్నా, జాన్వీ, ఇషాన్ ఖత్తర్ల నటన కట్టి పడేసిందన్న టాక్ వినిపించింది. సమీక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇవ్వడంతో కలెక్షన్ల పరంగా రెయిజ్ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల మల్టీప్లెక్సుల్లోనూ ధడక్ రిజల్ట్ బావుందన్న టాక్ వినిపించింది. జాన్వీ కేవలం తెలుగువారికే కాదు, ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం. గల్ఫ్ దేశాలు సహా పాకిస్తాన్‌లోనూ ధడక్ ఫర్వాలేదనిపించిందంటే అదంతా అతిలోక సుందరి వారసురాలిగా తనకు ఉన్న క్రేజు వల్లనే సాధ్యమైందని చెప్పొచ్చు. ఇక జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడుంటుందో వేచి చూడాల్సిందే.
User Comments