శ్రీదేవి కూతురు అందాల ప్రదర్శన

Last Updated on by

ఝాన్వీక‌పూర్.. ఇప్పుడు ఈ పేరు బాలీవుడ్ లో బాగా వినిపిస్తుంది. దానికి కార‌ణం శ్రీ‌దేవి కూతురు అని కాదు.. అమ్మ చ‌నిపోయిన త‌ర్వాత ఈ భామ త‌న కెరీర్ ను తీర్చిదిద్దుకుంటున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. శ్రీ‌దేవి ఉన్న‌పుడు అమ్మ‌కూచిలా ఉండే ఝాన్వీ.. ఇప్పుడు అమ్మో అనిపిస్తుంది. తాజాగా వోగ్ మ్యాగ‌జైన్ పై ఝాన్వీ క‌వ‌ర్ పేజీ అందాలు చూసి బాపురే.. ఏం భామ‌రే అనుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఇంత అందాన్ని చూసి బాలేదు అనుకున్నాం అనుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

నిజానికి ముందు నుంచి కూడా శ్రీ‌దేవి వార‌సురాలిగా ఎందుకో కానీ ఝాన్వీపై నెగిటివ్ రియాక్ష‌న్స్ ఉన్నాయి. దానికితోడు అమ్మ‌డి ప్రేమాయ‌ణాలు.. ఎఫైర్ల‌తో బ్యాడ్ ఇమేజ్ తెచ్చుకుంది. శ్రీ‌దేవి ఉన్న‌పుడు ఎలాగోలా ఇదంతా క‌వ‌ర్ అయిపోయింది. కానీ ఇప్పుడు అమ్మ‌లేదు క‌దా అందుకే చాలా జాగ్ర‌త్త‌గా ఉంటుంది ఝాన్వీ. ఇక మొన్న వోగ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ అందాలు స‌గ‌మే వ‌చ్చాయి. ఇప్పుడు పూర్తిగా విడుద‌ల‌య్యాయి. ఇందులో అమ్మ‌డి ర‌చ్చ ఇంకా ఎక్కువ‌ ఉంది. అందాల‌న్నీ ఆర‌బోసి అదిరిపోయే పోజులిచ్చింది ఝాన్వీక‌పూర్. మొత్తానికి ఝాన్వీ తీరు చూస్తుంటే పాప ధ‌డ‌క్ తోనే అంద‌రి ద‌ఢ్ క‌న్ అయిపోయేలా క‌నిపిస్తుంది.

User Comments