శ్రీ‌దేవికి బ్యాడ్‌నేమ్ ఎందుక‌ని!

Last Updated on by

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ఆక‌స్మిక మ‌ర‌ణం గురించి తెలిసిందే. దుబాయ్ లోని ఓ పెళ్లి ఫంక్ష‌న్‌లో అక‌స్మాత్తుగా బాత్ ట‌బ్‌లో మునిగి చ‌నిపోవ‌డం సంచ‌ల‌న‌మైంది. అది హ‌త్యా.. ఆత్మ‌హ‌త్య‌నా? అన్న‌ది ఇప్ప‌టికీ స‌స్పెన్స్. దీనిపై అభిమానుల్లో సందేహాలు అలానే ఉన్నాయి.

అయితే ఆ ఉదంతాన్ని స్ఫుర‌ణ‌కు తెస్తూ `శ్రీ‌దేవి బంగ్లా` అనే టైటిల్ తో ప్ర‌శాంత్ మాంబుల్లి అనే ఫిలింమేక‌ర్ సినిమా తీయ‌డంపై ప్ర‌స్తుతం శ్రీ‌దేవి అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అత‌డు ఆ టైటిల్ ఎంపిక చేయ‌డం వెన‌క అస‌లు కార‌ణ‌మేంటి? అంటే శ్రీ‌దేవి పేరుతో ఆ సినిమాకి ప్ర‌చారం చేసుకునే ఆలోచ‌నేన‌ని మామ్ అభిమానులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే స‌ద‌రు మేక‌ర్ కి శ్రీ‌దేవి భ‌ర్త బోనీక‌పూర్ కోర్టు నోటీసులు పంపారు. ఈ చిత్రంలో న‌టించిన క‌థానాయిక .. వింక్ గాళ్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ కి నోటీసులు అందాయి. వారియ‌ర్ ఈ చిత్రంలో ఒక ఒంట‌రి అయిన బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ గా న‌టిస్తోంది. ఇదంతా చూస్తుంటే శ్రీ‌దేవి పాత్ర‌ను స్ఫుర‌ణ‌కు తెస్తోంద‌ని, త‌న‌ని అవ‌మానించే ప్ర‌య‌త్న‌మిద‌ని బోనీ సీరియ‌స్ అయ్యారు. ఆ క్ర‌మంలోనే కోర్టు కేసులు ర‌న్ అవుతున్నాయి. కార‌ణం ఏదైనా వింక్ గాళ్ పాపులారిటీని శ్రీ‌దేవి బంగ్లా రెట్టింపు చేస్తోంది. శ్రీ‌దేవి గురించి తెలిసిన అంద‌రికీ ప్రియా ప్ర‌కాష్ ఎవ‌రో తెలిసిపోయింది. మొత్తానికి ప్ర‌చారం కోసం ఇలా శ్రీ‌దేవి పేరును ఉప‌యోగించుకోవ‌డంపైనా ఫ్యాన్స్ నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇంత‌కీ ఈ చిత్రంలో ఎవ‌రి క‌థ‌ను చూపించ‌బోతున్నారు? అన్న‌ది ఇప్ప‌టికైతే సస్పెన్స్. ఇక‌పోతే ఇటీవ‌లే ఓ వేడుక‌లో శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ కి దీనిపై ఓ చిక్కు ప్ర‌శ్న ఎదురైతే అందుకు స‌మాధానం దాట‌వేస్తూ.. మేనేజ‌ర్ సాయంతో అక్క‌డి నుంచి స్కిప్ కొట్ట‌డం చ‌ర్చ‌కొచ్చింది.

User Comments