పిక్‌ టాక్‌: భూలోక సుంద‌రి!

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ఇహ‌లోకం వీడి స్వర్గ‌లోక అధిరోహ‌ణం చేసినా, త‌న వార‌సురాలు జాన్వీని భూలోకంలోనే త‌న సువిశాల సామ్రాజ్యానికి అధినాయ‌కురాలిని చేసి వెళ్లింది. శ్రీ‌దేవి లెగ‌సీని కాపాడేందుకే జాన్వీ జ‌న్మించింద‌ని, బాలీవుడ్‌లో మెరుపులు మెరిపించేందుకే తన పుట్టుక అని ధ‌డ‌క్ చిత్రంతో రుజువైంది. న‌టించిన తొలి సినిమాతోనే మామ్‌ని మైమ‌రిపించే న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది జాన్వీ. అందంలో భూలోక సౌంద‌ర్య‌రాశిగా పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ నిర్ధేశ‌నంలో భారీ ఎపిక్ చిత్రం `త‌ఖ్త్‌`లో న‌టించ‌నుంది.

ఈలోగానే ఇదిగో ఇలా ముంబై ఫ్యాష‌న్ వీక్‌లో త‌న‌దైన త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శించి మైమ‌రిపించింది. జాన్వీ మేనివిరుపుల‌కు కుర్ర‌కారు గుండెల‌దిరిపోయాయ్ అంటే న‌మ్మండి. ర్యాంప్‌ని విరిచేసింది. చూప‌రుల క‌ళ్లు ఫెవికోల్‌తో అతికించిన‌ట్టు త‌న‌వైపే అతుక్కుపోయాయి. ఇదే ర్యాంప్ షోలో శ్రుతిహాస‌న్‌, దిశా ప‌టానీ లాంటి వేడెక్కించే ముద్దుగుమ్మ‌లు ఉన్నా, వాళ్లంద‌రినీ ప‌క్క‌న పెట్టేసి జ‌నం జాన్వీ వైపే అదేప‌నిగా చూశారు. నేటి షో స్టాప‌ర్‌గా జాన్వీ నిలిచిందంటే అతిశ‌యోక్తి కాదు. పూల పూల ప‌రికిణీ, దానిపై కాంబినేష‌న్ టాప్ ఓహ్‌! అద‌ర‌హో అని మీరే అంటారు ఇదిగో ఈ ఫోటో చూశాక‌.