జాన్వీకి క్రేజీ అవార్డ్‌

Last Updated on by

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ తొలి సినిమాతోనే న‌టిగా నిరూపించుకున్న సంగ‌తి తెలిసిందే. జాన్వీ న‌టించిన ధ‌డ‌క్ బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ సాధించింది. ఈ సినిమా కేవ‌లం ప‌ది రోజుల్లో 65కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఇద్ద‌రు డెబ్యూలు జాన్వీ-ఇషాన్ జంట‌గా న‌టించిన సినిమా ఇంత పెద్ద స‌క్సెస‌వ్వ‌డంపై బాలీవుడ్‌లో స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది. ఇక‌పోతే ఈ సినిమాతో జాన్వీకి గొప్ప పేరొచ్చింది. తాను న‌టిగా నిరూపించుకుంది. శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలుగా జాన్వీ న‌ట‌న‌, హావ‌భావాలు ఎంతో గొప్ప‌గా ఉన్నాయ‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

అందుకే ఇప్పుడు ప్ర‌ఖ్యాత వోగ్ మ్యాగ‌జైన్ జాన్వీ ప్ర‌తిభ‌ను గుర్తించి ప్ర‌త్యేక అవార్డుతో స‌త్క‌రించింది. వోగ్ బ్యూటీస్ 2018 పుర‌స్కారాల్లో ఫ్రెష్ ఫేస్ అవార్డ్‌ని అందుకుంది జాన్వీ. ఇదే వేదిక‌పై క‌త్రిన, విద్యాబాల‌న్‌, ష‌బానా ఆజ్మీ త‌దిత‌రులు పుర‌స్కారాలు అందుకున్నారు. ఈ అవార్డుల వేళ ఒక‌వేళ మామ్ శ్రీ‌దేవి అదే వేదిక‌పై ఉండి ఉంటే ఎంత‌గానో మురిసిపోయి ఉండేదేమో! మామ్‌ని మిస్స‌యిన జాన్వీ పుర‌స్కారాన్ని త‌న‌కే అంకిత‌మిచ్చింది.


Related Posts