చ‌ర‌ణ్ కి జ‌పాన్ ఫ్యాన్స్ స‌ర్ ప్రైజ్

జ‌పాన్ లో తెలుగు హీరోల‌లో ప్ర‌భాస్ త‌ర్వాత అత్యంత ప్రేక్ష‌కాద‌ర‌ణ క‌ల్గిన హీరో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన `మ‌గ‌ధీర` జ‌పాన్ లో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి చెర్రీకి జ‌పాన్ లోను అభిమానులున్నారు. రంగ‌స్థ‌లం సినిమాను చైనాలో విడుదల చేసిన నేప‌థ్యంలో జ‌పాన్ లో కూడా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. మార్చి 27న చ‌ర‌ణ్ బ‌ర్త్ డే జ‌రుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా చెర్రీకున్న అభిమానులంతా శుభాకాంక్ష‌లు తెలిపి అభిమానాన్ని చాటుకున్నారు.

అయితే జ‌పాన్ అభిమానులు మాత్రం గ్రీటింగ్ కార్డులు పోస్ట్ ద్వారా పంపి చెర్రీకి విషెస్ చెప్పారు. చరణ్ ఈ గ్రీటింగ్‌ కార్డును ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ. ‘జపాన్‌ నుంచి స్వీట్‌ సర్‌ప్రైజ్‌ను అందుకున్నాను. నా పట్ల మీకున్న ప్రేమానురాగాలు నన్నెంతో సంతోష పరిచాయి. నా జపాన్‌ అభిమానులకు ప్రేమను పంపుతున్నాను. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. థాంక్యూ జపాన్‌’ అని చ‌ర‌ణ్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ ఆర్ ఆర్` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.