బ‌యోపిక్‌: `అమ్మ‌`కు ఆత్మ ఘోష‌

Last Updated on by

అమ్మ జ‌య‌ల‌లిత‌కు ఆత్మ‌ఘోష త‌ప్పేట్టు లేదు. బ‌యోపిక్ పేరుతో అమ్మ జీవితాన్ని వెండితెర‌కెక్కించేందుకు మేక‌ర్స్ అంతా ఒక‌రితో ఒక‌రు పోటీకి రావ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. `ఎన్టీఆర్` బ‌యోపిక్‌ నిర్మాత విష్ణు ఇందూరి ఇటీవ‌లే జ‌య‌ల‌లిత‌పై బ‌యోపిక్ ని ప్ర‌క‌టించారు. అమ్మ జ‌యంతి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న సినిమాని అధికారికంగా ప్రారంభిస్తామ‌ని తెలిపారు.

అయితే అమ్మ‌పై ఇప్ప‌టికే వేరొక నిర్మాత సినిమా తీసేందుకు రెడీ అవుతున్నార‌ట‌. ఆయ‌న పేరు ప్రియ‌ద‌ర్శి. `జ‌యా` అనే టైటిల్‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇది కూడా ఫిబ్ర‌వ‌రి 24న లాంచ్ అని చెబుతున్నారు. ఈ ఇద్ద‌రితో పాటు సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా వేరొక స్క్రిప్టు రెడీ చేసుకుని జ‌య‌ల‌లిత బ‌యోపిక్ తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆదిత్య భ‌ర‌ద్వాజ్ అనే నిర్మాత పెట్టుబ‌డులు స‌మ‌కూర్చ‌నున్నార‌ట‌. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజాని సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేసుకున్నారు. ఇలా ఒకేసారి మూడు బ‌యోపిక్‌లు జ‌య‌ల‌లిత‌పై ప్రారంభం కానున్నాయ‌న్న‌ది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. అమ్మ ఆత్మ ఘోషించేలా ఇన్ని బ‌యోపిక్‌లా?

User Comments