దివంగత ముఖ్యమంత్రి అమ్మ ‘జయలలిత’ జీవితం ఆధారంగా తలైవి టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కంగన ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి ‘ఏ ఎల్ విజయ్’ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రాజకీయ అంశాలతో పాటు జయలలి మృతి వెనుక గల కాణాలను హైలైట్ చేస్తున్నట్లు సమాచారం. రాజకీయంగా జయలలిత పై జరిగిన కుట్రలు, అసెంబ్లీలో ఆమె పై జరిగిన దాడుల్లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి పాత్ర ఎంత ఉందా? అలాగే శోభన్ బాబు ,జయలలిత మధ్య అనుబంధం పై వచ్చిన రూమర్స్ లో వాస్తవం ఎంత? లాంటి అంశాలను ఆసక్తికరంగా మలచనున్నారుట.
జయలలిత – ఎంజీఆర్ మధ్య ప్రేమ, సాన్నిహిత్యం ఎంత బలమైనదో కూడా ఈ బయోపిక్ లో క్లారిటీగా చూపించనున్నారుట. జయలలితకి కుమార్తె కలదని ఆరోపణల నేపథ్యంలో ఆ విషయాన్ని కూడా సినిమాలో టచ్ చేస్తారనే రూమర్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి అమ్మ బయోపిక్ లో ఆమె జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు కూడా రివీల్ చేస్తున్నట్లుంది. జయలలిత బయోపిక్ కోసం కంగన ప్రత్యేకంగా తమిళం కూడా నేర్చుకుంటుంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ల