టిక్ టిక్ టిక్.. ఆకాశ‌వీధిలో అందాల అద్భుతం..

Last Updated on by

ఇన్నాళ్లూ ఇండియ‌న్ సినిమా అంటే కేవ‌లం హిందీ సినిమాల‌ను మాత్రమే చూపించేవారు. కానీ ఇప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే హిందీ మాత్ర‌మే కాదు.. మేం కూడా ఉన్నాం అంటూ త‌మిళ‌, తెలుగు ఇండ‌స్ట్రీలు కూడా తొడ‌గొట్టి చెబుతున్నాయి. కొత్త క‌థ‌లు మీ ద‌గ్గ‌రి కంటే మా ద‌గ్గ‌రే ఎక్కువగా వ‌స్తున్నాయ‌ని నిరూపిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. తాజాగా త‌మిళ‌నాట తెర‌కెక్కిన‌ టిక్ టిక్ టిక్ సినిమానే దీనికి నిద‌ర్శ‌నం. ఇది మ‌న ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలోనే తొలిసారి స్పేస్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం. ఇప్ప‌టి వ‌ర‌కు రోబో లాంటి సైంటిఫిక్ సినిమాల‌ను చూసాం కానీ తొలిసారి స్పేస్ థ్రిల్ల‌ర్ ను మాత్రం టిక్ టిక్ టిక్ లోనే చూడ‌బోతున్నాం. శ‌క్తి సౌంద‌ర రాజ‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఇప్ప‌టికే త‌మిళ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇప్పుడు తెలుగు ట్రైల‌ర్ ను సాయిధ‌రంతేజ్ విడుద‌ల చేసాడు.

హాలీవుడ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్. జ‌యంర‌వి హీరోగా న‌టించిన ఈ చిత్రంలో నివేదా పెతురాజ్ హీరోయిన్. మెంట‌ల్ మ‌దిలో సినిమాతో ఈ భామ తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది. ఈ సినిమా కోసం అదిరిపోయే విజువ‌ల్ ఎఫెక్ట్స్ వాడుకున్నారు. హాలీవుడ్ సైన్స్ ఫింక్షన్ స్పేస్ థ్రిల్ల‌ర్స్ స్థాయిలోనే.. ఇక్క‌డి బ‌డ్జెట్ కు తగ‌ట్లు టిక్ టిక్ టిక్ చిత్రాన్ని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు సౌంద‌ర రాజ‌న్. ట్రైల‌ర్ లోనే సినిమా ఎలా ఉండ‌బోతుందో చూపించాడు ద‌ర్శ‌కుడు. జ‌న‌వ‌రి 26 రిప‌బ్లిక్ డే రోజు ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ మ‌ధ్య త‌ని ఒరువ‌న్, భోగ‌న్ లాంటి వ‌ర‌స విజ‌యాల‌తో జోరుమీదున్న జ‌యం ర‌వికి ఇది మ‌రింత బూస్ట‌ప్ ఇవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. టిక్ టిక్ టిక్ గ‌న‌క హిట్టైతే.. ఆటోమేటిక్ గా అలాంటి కాన్సెప్టులు మ‌రిన్ని వ‌స్తాయ‌న‌డంలో సందేహం లేదు.

User Comments