చంద్ర‌బాబుకు ఝ‌ల‌కిచ్చిన జ‌య‌సుధ‌!

Last Updated on by

తెలంగాణ‌లోని సికింద్రాబాద్ నియోజ‌క వ‌ర్గంలో ఎమ్మెల్యేగా రెండు ద‌ఫాలు కాంగ్రెస్ అభ్య‌ర్థిగా సేవ‌లందించిన జ‌య‌సుధ ఆ త‌రువాత త‌ల‌సాని చేతిలో దారుణంగా ఓట‌మిపాలై గ‌త కొంత కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా వుంటూ వ‌స్తోంది. కొంత విరామం త‌రువాత టీడీపీ తీర్థం పుచ్చుకుంది. ఆ స‌మ‌యంలోనే `మా` ఎన్నిక‌ల్లోనూ అధ్య‌క్షురాలిగా త‌న స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నించినా న‌ట‌కిరీటి రాజేంద్ర‌ప్ర‌సాద్ చేతిలో దారుణంగా ఓట‌మిపాలైంది. ఆ త‌రువాత నుంచి రాజ‌కీయ అంశాల‌కు, కార్య‌క్ర‌మాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్న జ‌య‌సుధ మ‌రోసారి పార్టీ మారింది.

రాష్ట్ర విభ‌జ‌న ప‌రిణామాల అనంత‌రం ఏడాది క్రితం టీడీపీలో చేరిన జ‌య‌సుధకు గ‌త కొంత కాలంగా టీడీపీఏ ఎలాంటి ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేదు. పైగా తెలంగాణ‌లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవ‌డంతో ఇక్క‌డున్న నాయ‌కుల‌కు ప్రాధాన్య‌త లేకుండా పోయింది. ఇలాగే టీడీపీలో వుంటే లాభం లేద‌నుకున్న ఆమె తాజాగా వైసీపీలోకి చేర‌బోతున్నారు. గురువారం సాయంత్రం వైఎస్ జ‌గ‌న్‌ని లోట‌స్ పాండ్‌లో క‌లిసి త‌న ఎంట్రీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌మ‌ని కోర‌బోతున్నారు. అన్నీ ఓకే అయితే సాయంత్ర‌మే జ‌య‌సుధ మీడియా స‌మావేశాన్ని కూడా నిర్వ‌హించే అవ‌కాశం వుంద‌ని ప‌లువురు రాజ‌కీయ నేత‌లు చెబుతున్నారు.

User Comments