జీవిత రాజ‌శేఖ‌ర్ మ‌ళ్లీ పార్టీ జంప్!

Last Updated on by

జీవిత రాజ‌శేఖ‌ర్ మ‌ళ్లీ పార్టీ మారారండోయ్‌!
జీవిత రాజ‌శేఖ‌ర్ మ‌ళ్లీ పార్టీ మారారండోయ్. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వున్న స‌మ‌యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని హ‌డావిడి చేసిన జీవితా రాజ‌శేఖ‌ర్ జంట ఆ త‌రువాత జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల మధ్య నారా చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరారు. అక్క‌డితో ఆగారా అంటే అదీలేదు. అక్క‌డ స‌ఖ్య‌త కుద‌ర‌లేదో లేక వీరికి త‌గిన ప్రాధాన్య‌త ద‌క్క‌లేదో తెలియ‌దు కానీ అక్క‌డి నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరి జంపింగ్‌ల‌ని చూసి పార్టీ జండాలే నివ్వెర‌పోయాయంటే అది అతిశ‌యోక్తి కాదేమో.
ఇక గ‌త కొంత కాలంగా సైలెంట్‌గా వున్న ఈ త‌మిళ జంట `మా` ఎన్నిక‌ల‌తో మ‌ళ్ళీ తెర‌పైకొచ్చింది.  ఇక ఊరుకుంటారా మ‌ళ్ళీ ఏదో ఒక‌టి చేసేయొద్దు. అదుకేనేమో మ‌ళ్ళీ పార్టీ పారిపోయారు. ఈ మ‌ధ్య మూకుమ్మ‌డిగా సినీ తార‌లంతా వైసీపీకి జైకొడుతున్న విష‌యం తెలిసిందే. ఈ అవ‌కాశాన్ని ఎందుకు జార‌విడుచుకోవాల‌నుకున్నారో ఏమోగానీ మొత్తానికి జీవితా రాజ‌శేఖ‌ర్ కూడా వైసీపీలోకి జంపైపోయారు. పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువాక‌ప్పుకుని పార్టీలో చేరిపోయారు. ఈ రోజు ఉద‌యం హైద‌రాబాద్‌లోని జ‌గ‌న్ నివాసం వున్న‌ లోట‌స్ పాండ్‌కు చేరుకుని జగ‌న్‌మోహ‌న్‌రెడ్డితో స‌మావేశ‌మ‌య్యారు. పార్టీకి వీర విధేయులుగా వుంటామ‌ని చెప్పి పార్టీలో చేర‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

User Comments