నాగ‌చైత‌న్య స‌ర‌స‌న శ్ర‌ద్ధా శ్రీనాథ్

యంగ్ హీరో నాగ‌చైత‌న్య‌, మామ వెంక‌టేష్ తో క‌లిసి `వెంకీ మామ‌`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉందీ సినిమా. `ప‌వ‌ర్` ఫేం బాబి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. మామ అల్లుళ్ల కామెడీ ప్ర‌ధానంగా సాగ‌నుంది. ఫిబ్ర‌వ‌రిలో సెట్స్ కు వెళ్లిన టీమ్ జూలై లోపు అన్ని ప‌నులు పూర్తిచేసి రిలీజ్ చేయాల‌ని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చై న‌టించ‌బోయే సినిమా ఏంట‌న్న‌ది ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చింది. దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయ‌డానికి ఇటీవ‌లే అగ్రిమెంట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. శ‌షి అనే కొత్త కుర్రాడు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నాడు.

తాజాగా ఈ సినిమాలో చై స‌ర‌స‌న `జెర్సీ` భామ శ్ర‌ద్ధా శ్రీనాథ్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసారు. దిల్ రాజు నిర్మాణ వ‌ర్గాల నుంచి ఈ విష‌యం లీకైంది. శ్ర‌ద్ధా మంచి పెర్పామ‌ర్ అని తొలి సినిమాతోనే నిరూపించుకుంది. యాక్టింగ్ లో నేచుర‌ల్ స్టారికి గ‌ట్టి పోటినిచ్చింది. కీర్తి సురేష్‌, నివేధా థామ‌స్ లా టాలీవుడ్ కు మ‌రో మంచి పెర్పామ‌ర్ దొరికింద‌ని ప్ర‌శంస‌లందుకుంటోంది. ఇక రెండ‌వ సినిమా లోచై స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ఒడిసిప‌ట్టుకుందంటే భ‌విష్య‌త్ చూసుకునే ప‌నిలేదు. ప్ర‌స్తుతం అమ్మ‌డు క‌న్న‌డ‌, త‌మిళ్ లో క‌లిపి సినిమాల‌తో బిజీగా ఉంది. ఇదే ఏడాది ఆ సినిమాలు విడుద‌ల కానున్నాయి.