జెర్సీ మూవీ రివ్యూ

నటీనటులు : నాని, శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌, స‌త్య‌రాజ్‌, కమ్రా త‌దిత‌రులు..
బ్యానర్: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: సూర్య దేవ‌ర నాగ‌వంశీ
సంగీతం: అనిరుధ్ రామ చంద్ర‌న్
రచన- దర్శకత్వం: గౌత‌మ్ తిన్న‌నూరి

ముందు మాట:

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస ప్ర‌యోగాల‌తో టాలీవుడ్ లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప‌క్కింటి అబ్బాయి త‌ర‌హా పాత్ర‌ల‌తో ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్సెస్ తో ఓ మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసినా ప్ర‌యోగాత్మ‌క క‌థల్ని ఎంచుకుని అత‌డు కంబ్యాక్ అయిన తీరు ఆస‌క్తిక‌రం. అందుకే ఈసారి జెర్సీ లాంటి క్రికెట్ నేప‌థ్యం ఉన్న ప్ర‌యోగాత్మ‌క క‌థ‌ని ఎంచుకున్నాడు అన‌గానే జ‌నాల్లో ఒక‌టే ఆస‌క్తి. మ‌ళ్లీ రావా లాంటి క్లాసిక్ హిట్ అందుకున్న గౌత‌మ్ తిన్న‌నూరి తో క‌లిసి అత‌డు ఓ విభిన్న‌మైన ప్ర‌య‌త్నం చేశాడు. సినిమా రిలీజ్ ముందే ఎమోష‌నల్ హిట్ కొడుతున్నా.. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాన‌ని నాని ఇంట‌ర్వ్యూల్లో అన్నారు. పెద్ద తెర‌పై లైవ్ క్రికెట్ చూస్తున్న అనుభూతితో పాటు.. ఫ్యామిలీ ఎమోష‌న్స్ క‌ట్టి ప‌డేస్తాయ‌ని అన్నారు నాని. అత‌డు చెప్పిన‌ట్టే జెర్సీ ఆడియెన్ ని అంత‌గా యంగేజ్ చేసిందా? అస‌లు ఈ సినిమాలో ఏం ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చ‌ద‌వాల్సిందే.

సింగిల్ లైన్‌:

ప్ర‌తిభావంతుడైన ఓ క్రికెట‌ర్ ఫ‌్యామిలీ లైఫ్‌ క‌ష్టాల‌తో కెరీర్ ప‌రంగా వెన‌క‌బ‌డిన త‌ర్వాత లేటు వ‌య‌సులోనూ కంబ్యాక్ అయ్యి ఎలాంటి విక్ట‌రీ సాధించాడు.. అన్న‌దే జెర్సీ స్టోరి.

కథనం- అనాలిసిస్:

నాని(అర్జున్) పెళ్లి త‌ర్వాత లైఫ్ లో ఎదుర‌య్యే ప్రాబ్లెమ్స్ తో క్రికెట‌ర్ గా లైఫ్ ని కోల్పోవాల్సి వ‌స్తుంది. అయితే అంత‌టి నిరాశ‌లోనూ తాను వ‌దులుకున్న ల‌క్ష్యాన్ని తిరిగి ఛేధించేందుకు ప‌దేళ్ల త‌ర్వాత సంక‌ల్పిస్తాడు. లేటు వ‌య‌సు క్రికెటర్ గా ఓ ప్ర‌య‌త్నం చేస్తాడు. ఆ క్ర‌మంలో అర్జున్ ఎదుర్కొన్న ప‌రిణామాలేంటి? అత‌డు భార‌త జ‌ట్టుకు ఎంపిక కావాలని చేసే ప్ర‌య‌త్నం స‌క్సెసైందా లేదా? అన్న‌దే సినిమా. అర్జున్ – సారా జంట జీవితంలో ఎదురైన ఎమోష‌న్ ఏంటి అన్న‌ది తెర‌పైనే చూడాలి.

క్రికెట్ నేప‌థ్యంలో క‌థ‌ని ఎంచుకున్నారు అన‌గానే అది సాహ‌సంతో కూడుకున్న ప‌నే అని అంతా భావించారు. పైగా లైవ్ క్రికెట్ లా చూపిస్తామంటున్నారు అన‌గానే సందేహాలు నెల‌కొన్నాయి. గౌత‌మ్ తిన్న‌నూరి కొత్త ద‌ర్శ‌కుడు ఎలా తెర‌కెక్కిస్తాడో అంటూ చ‌ర్చ సాగింది. కానీ అత‌డు ఈ సినిమాని తెర‌కెక్కించిన తీరు అస‌మానం. ఆద్యంతం అద్భుత‌మైన ఎమోష‌న్స్ తో తీర్చిదిద్ద‌డంలో వంద శాతం స‌క్సెస‌య్యాడు. అయితే సుదీర్ఘ నిడివి అన్న‌ది కొంత సాగ‌తీత అనిపిస్తుంది. నాని అద్భుత న‌ట‌నా చాతుర్యంతో ప్ర‌తి స‌న్నివేశంలో జీవించ‌డం.. అలాగే స్క్రీన్ ప్లే ప‌రంగా కొన్ని జిమ్మిక్కులు పెద్ద స్థాయిలోనే వ‌ర్క‌వుట‌య్యాయి. 1986 .. 1996.. 2018 లో సాగేలా క‌థాంశాన్ని తీర్చిదిద్దిన తీరు ఆక‌ట్టుకుంది. అర్జున్ జీవితంపై పుస్త‌కాన్ని ఆవిష్క‌రించ‌డం.. అత‌డి కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో నేరేట్ చేయ‌డం ఇంట్రెస్టింగ్. ప్రేమించి పెళ్లి చేసుకుంటే వ‌చ్చే క‌ష్ట‌న‌ష్టాలు తంటాల్ని అర్జున్ – సారా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్ప‌డం ఆక‌ట్టుకుంది. బంధాలు.. అనుబంధాలు.. మిడిల్ క్లాస్ క‌ష్టాలు.. ఆట‌గాడి విల్ ప‌వర్.. ఇలా ప్ర‌తిదీ ఎమోష‌నల్ గా క‌ట్టి ప‌డేశాయి.

నటీనటులు:
నానీని అంద‌రూ ఎందుకు నేచుర‌ల్ స్టార్ అంటారో మ‌రోసారి తెర‌పై డైరెక్టుగానే ప్రూవ్ అయ్యింది. జెర్సీ చిత్రంలో క్రికెట‌ర్ గా అత‌డు ప్రాణం పెట్టేశారు. అర్జున్ పాత్ర‌లో జీవించాడంటే అతిశ‌యోక్తి కాదు. నాని పాత్ర‌లో ర‌క‌ర‌కాల షేడ్స్ ఆద్యంతం ఉత్కంఠ‌గా పండాయి. ఇక అత‌డి భార్య సారా పాత్ర‌లో శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. నాని కొడుకుగా న‌టించిన క‌మ్రా.. కోచ్ గా న‌టించిన స‌త్య‌రాజ్ అద్భుత అభిన‌యం క‌న‌బ‌రిచారు.

టెక్నికాలిటీస్:
ద‌ర్శ‌క‌త్వంలో గౌత‌మ్ తిన్న‌నూరి ప‌నిత‌నాన్ని ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేం. అద్భుతమైన క‌థ‌ను ఎంచుకుని టెక్నిక‌ల్ గానూ చ‌క్క‌ని ఔట్ పుట్ ని తేవ‌డంలో అత‌డు వంద‌శాతం స‌క్సెస‌య్యాడు.
క్రీడా నేప‌థ్యం సినిమాల‌కు సినిమాటోగ్ర‌ఫీ అత్యంత కీల‌కం. ఆ విభాగం అద్భుతంగా ప‌ని చేసింది. అనిరుధ్ రీరికార్డింగ్ .. పాట‌లు చ‌క్క‌గా కుదిరాయి. ఎడిటింగ్ విభాగం మ‌రింత బెటర్ గా ప‌ని చేస్తే క్రిస్పీనెస్ పెరిగేదే. ఇత‌ర విభాగాలు ఓకే.

ప్లస్ పాయింట్స్:

*నేచుర‌ల్ స్టార్ నాని న‌ట‌న‌
* నాని కొడుకు రోహిత్ క‌మ్రా..
* ఎంచుకున్న క‌థా నేప‌థ్యం

మైనస్ పాయింట్స్:

* సుదీర్ఘ నిడివి..
* సాగ‌తీత స‌న్నివేశాలు..

ముగింపు:
జెర్సీ.. ఒక అద్భుత‌మైన ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌.. నేచుర‌ల్ వండ‌ర్.

రేటింగ్:
3.25/ 5

Also Read: Jersey Movie Review