ధ‌డ‌క్ రిజ‌ల్ట్ ఇదే

Last Updated on by

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి పెద్ద కుమార్తె జాన్వీ తెరంగేట్రంపై బాలీవుడ్ స‌హా అన్ని సినీప‌రిశ్ర‌మ‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌దేవి అభిమానులు గ‌త నాలుగేళ్లుగా జాన్వీ ఆరంగేట్రంపై ఎంతో క్యూరియ‌స్‌గా ఉన్నారు. అయితే ఈ ఉత్కంఠ‌కు త‌గ్గ‌ట్టే జాన్వీ డెబ్యూ సినిమాలో బాగా న‌టించిందా లేదా? నేడు జాన్వీ న‌టించిన `ధ‌డ‌క్` ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజైన సంద‌ర్భంగా అంద‌రిలో ఒక‌టే ఉత్కంఠ‌. జాన్వీ న‌ట‌న‌పైనా, ధ‌డ‌క్‌పైనా అస‌లు ప్రేక్ష‌కుల్లో టాక్ ఎలా ఉంది? అని ఆరాతీస్తే ..

జాన్వీ తొలి సినిమాతోనే వంద‌శాతం మార్కులు వేయించుకుంద‌ని ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. క‌ళ్ల‌తోనే కోటి రాగాలు ప‌లికించిన జాన్వీ బాలీవుడ్‌లో పెద్ద స్టార్‌గా ఎద‌గ‌డం ఖాయ‌మ‌న్న టాక్ వినిపిస్తోంది.ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాతో తెరంగేట్రం చేసింద‌ని అభిమానులు మురిసిపోతున్నారు. ఈ గురువారం సాయంత్రం నుంచి `ధ‌డ‌క్‌` ప్రివ్యూల హ‌డావుడి ఓ రేంజులో సాగింది. మిడ్‌నైట్‌లోనే సినిమా రిపోర్ట్ అందేసింది. అభిమానుల అంచ‌నాల్ని చేరుకోవ‌డంలో జాన్వీ పెద్ద స‌క్సెసైంది. అద్భుత‌మైన న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసింద‌న్న టాక్ వినిపించింది. అలానే షాహిద్ క‌పూర్ సోద‌రుడు ఇషాన్ ఖ‌త్త‌ర్ న‌టించిన‌ రెండో సినిమా ఇది. అత‌డి న‌ట‌న‌కు చ‌క్క‌ని మార్కులే వేశారు స‌మీక్ష‌కులు. బ‌ద్రినాథ్ కా దుల్హానియా ఫేం శ‌శాంక్ ఖైతాన్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. మ‌రాఠా బ్లాక్‌బ‌స్ట‌ర్ సైరాట్‌ని క‌ర‌ణ్ జోహార్ రీమేక్ చేసిన‌ సంగ‌తి తెలిసిందే.

User Comments