పాపం శ్రీదేవి కోరిక తీరనే లేదు

Last Updated on by

శ్రీ‌దేవి బ‌తికున్న‌పుడు ఝాన్వీ క‌పూర్, ఖుషీ క‌పూర్ యువ‌రాణుల్లా బ‌తికారు. వాళ్ల ఫైనాన్షియ‌ల్ క్రైసిస్ ఎలా ఉన్నా కూడా శ్రీ‌దేవి మాత్రం త‌న కూతుళ్ల‌ని ఎలాంటి క‌ష్టం రాకుండానే పెంచింది. ఎప్పుడు చూసినా హై ప్రొఫైల్ మెయింటేన్ చేస్తూ ముంబైలో తెగ తిరిగేసారు ఝాన్వీ అండ్ ఖుషీ. ఇన్నాళ్లూ ఆమెకు ఉన్న పిఆర్ తోనే కూతుళ్లు ఏం చేసినా చెల్లింది. కానీ ఇప్పుడు శ్రీ‌దేవి లేదు. ఆ కూతుళ్ల‌కు అమ్మ లేదు. ఇన్నాళ్లూ త‌ల్లి చాటు బిడ్డ‌ల్లా ఉన్న ఇద్ద‌రు పిల్ల‌లు ఇప్పుడు ఎటెళ్లాలో తెలియ‌ని దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో ప‌డిపోయారు. పాపం.. శ్రీ‌దేవికి అయితే పెద్ద కూతురును హీరోయిన్ గా చూడాల‌ని చాలా ఆశ‌. అది తీర‌కుండానే ఇప్పుడు వెళ్లిపోయింది.

ఝాన్వి న‌టిస్తోన్న ధ‌డ‌క్ షూటింగ్ త్వ‌ర‌లోనే పూర్తికానుంది. జూన్ లో సినిమా విడుద‌ల కానుంది. శ్రీ‌దేవి ఉన్న‌పుడు ఝాన్వి ఏం చేసినా న‌డిచింది. త‌ల్లికి ఉన్న ఇమేజ్ ను వాడుకుంటూ కొన్నిసార్లు మితిమీరిన ప‌నులు కూడా చేసింది ఝాన్వి. కానీ శ్రీ‌దేవి కూతురు అనే ఒకేఒక్క బ్రాండ్ ఝాన్విని కాపాడింది. కానీ ఇప్పుడు ఆ బ్రాండే లేదు. ఇప్పుడు కూడా ఝాన్వి క‌పూర్ ఇలాగే ఉంటుందా..? ఇక ఖుషీ క‌పూర్ అయితే త‌ల్లిచాటు బిడ్డే. ఎప్పుడూ అమ్మ‌ను వ‌దిలి ఉండ‌లేదు చిన్న‌కూతురు. ఇప్పుడు శ్రీ‌దేవి చ‌నిపోయినందుకు కాదు.. ఆ ఇద్ద‌రు కూతుళ్ల‌ను చూసి అంతా బాధ ప‌డుతున్నారు. బోనీక‌పూర్ ఉన్నా కూడా ఫ్యామిలీ బాధ్య‌త‌ల‌న్నీ తానే చూసుకునేది శ్రీ‌దేవి. పాపం.. మ‌రిప్పుడు ఆ ఇద్ద‌రు కూతుళ్ల ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతుందో ఏమో అంటూ బాధ ప‌డుతున్నారు శ్రీ‌దేవి స‌న్నిహితులు.

User Comments