శ్రీదేవి కోరికను కూతురు నెరవేర్చాలి

Last Updated on by

శ్రీ‌దేవి చ‌నిపోవ‌డంతో ఆ కుటుంబం పుట్టెడు దుఖంలో ఉంది. ఝాన్వీ క‌పూర్ కూడా త‌ల్లి చ‌నిపోక ముందు ధ‌డ‌క్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఈమె న‌టిస్తున్న తొలి సినిమా ఇదే. ఈ సినిమా షూటింగ్ లో ఉన్న‌పుడే శ్రీ‌దేవి చ‌నిపోయింద‌నే వార్త తెలుసుకుంది ఝాన్వి. అందుకే ఆమె తుదిశ్వాస విడిచే ముందు కూడా తల్లితో పాటు లేదు ఈ అమ్మ‌డు. శ్రీ‌దేవితో పాటు దుబాయ్ కు చిన్న‌కూతురు ఖుషీ క‌పూర్ వెళ్లింది. అక్క‌డే అమ్మతో పాటు ఉంది. త‌ల్లి చ‌నిపోయిన త‌ర్వాత ప‌ది రోజులుగా ఇంట్లోనే ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్యే త‌న పుట్టిన‌రోజును కూడా అనాథల మ‌ధ్య శోకంతో చేసుకుంది ఝాన్వి. ఇక ఇప్పుడు మ‌ళ్లీ సినిమాతో బిజీ అయింది ఈ భామ.Jhanvi Kapoor Too Emotional In Dhadak Shooting Locationత‌ల్లి పోయిన బాధ‌ను గుండెల్లోనే దాచుకుంటూ ధ‌డ‌క్ షూటింగ్ లో బిజీ అయింది ఝాన్వీక‌పూర్. త‌న‌ను మంచి హీరోయిన్ గా చూడాల‌నుకున్న త‌ల్లి కోరిక‌ను నెర‌వేర్చేందుకు త‌న వంతు కృషి చేస్తుంది శ్రీ‌దేవి పెద్ద‌కూతురు. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే స‌గానికి పైగా పూర్త‌యింది. జూన్ లో సినిమా విడుద‌ల కానుంది. కూతురు బాధ్య‌త‌ల‌ను ఎంతో ఆలోచించి క‌ర‌ణ్ జోహార్ చేతుల్లో పెట్టింది శ్రీదేవి. ధ‌డ‌క్ సినిమాను సూప‌ర్ హిట్ చేసి ఆమెకు అపురూప‌మైన బ‌హుమ‌తి ఇవ్వ‌డ‌మే త‌మ ల‌క్ష్యం అంటున్నాడు క‌ర‌ణ్ జోహార్. మ‌రాఠీలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన సైరాత్ సినిమాకు ఇది రీమేక్. మొత్తానికి పుట్టెడు దుఖంలో కూడా మ‌ళ్లీ షూటింగ్ కు వ‌చ్చేసింది ఝాన్విక‌పూర్. ఆమె సెట్ లో అడుగుపెట్ట‌డంతోనే ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయిపోయి ఏడ్చేసింది. దాంతో చిత్ర‌యూనిట్ అంతా ఒక్క‌చోట చేరి ఝాన్విని ఓదార్చే ప‌నిలో బిజీ అయిపోయారు.

User Comments