ఓ మై గాడ్! జాన్వీని చుట్టూ మూగారు

Last Updated on by

ఇంకా ఒక్క సినిమా అయినా రిలీజ్ కాలేదు. అప్పుడే స్టార్‌కిడ్ జాన్వీకి అసాధార‌ణ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి త‌న‌య‌గా జాన్వీకి ఉన్న ఐడెంటిటీ వేరు. త‌న‌కు తానుగా ఇక మీద‌ట‌ ఐడెంటిటీ తెచ్చుకోవ‌డం వేరు. అయితే ఇటీవ‌లే జాన్వీ డెబ్యూ సినిమా `ధ‌డ‌క్‌` పోస్ట‌ర్లు, ఫ‌స్ట్‌లుక్‌లు ఆక‌ట్టుకున్నాయి. దీంతో సినిమా రిలీజ్ ముందే అద్భుత‌మైన ఫాలోవ‌ర్స్ ఏర్ప‌డ్డారు. అస‌లు ముంబై న‌గ‌రంలోనే కాదు దేశంలోని ప‌ల్లె ప‌ల్లెనా జాన్వీ బాగా ఫేమ‌స్ అయిపోయింది.

అస‌లు జాన్వీకి ఏ రేంజులో ఫాలోవ‌ర్స్ ఉన్నారో అర్థం చేసుకోవాలంటే ఓసారి త‌ను వెళ్లే జిమ్ముకో, లేక త‌ను షాపింగుల‌కు వెళ్లిన‌ప్పుడో ఆ ప‌రిస‌రాల‌కు వెళితే తెలిసిపోతుంది. ఇదిగో ఇటీవ‌లే ఓసారి ఇలా షాపింగు కోసం బ‌య‌ల్దేరిన జాన్వి కోసం అభిమానులు గుంపులు గుంపులుగా ఎగ‌బ‌డ్డారు. జాన్వీ జాన్వీ జాన్వీ … అంటూ చుట్టూ మూగారు. ఆ స‌న్నివేశం నుంచి ఎలాగోలా బాడీ గార్డుల సాయంతో జాన్వీ బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగిందే కానీ.. నిజానికి రౌండ‌ప్ చేసి క‌న్ఫ్యూజ్ చేసేవాళ్లే. జాన్వీ ధ‌డ‌క్ జూన్‌లో రిలీజ్‌కానున్న సంగ‌తి తెలిసిందే.

User Comments