జిగేల్ జిగేల్ మూవీ ప్రారంభం

Last Updated on by

శ్రీ నవ నారాయణ సినీ క్రీయేషన్స్ పతాకం పై అభయ్ , గీత్ షా హీరో హీరోయిన్లు గా నాగరాజు తలారి దర్శకత్వం లో అంజనప్ప , నాగరాజ నిర్మాతలుగా నిర్మిస్తున్న యాక్షన్ సెంటిమెంట్ కామెడీ చిత్రం ‘జిగేల్ జిగేల్ ‘ ఈ చిత్రం ఇటీవల షకీల్ స్టూడియోస్ లో ప్రారంభం అయ్యింది .ముహూర్తపు సన్నివేశానికి హీరో హీరోయిన్లు పై ప్రముఖ పారిశ్రామికవేత్త పట్నం యాదగిరి క్లాప్ ఇచ్చారు. సింగర్ నేహా మౌష్మి కెమెరా స్విచ్ ఆన్ చేశారు .ఫస్ట్ షాట్ డైరెక్షన్ ప్రముఖ దర్శకుడు టిన్.రాజు దర్శకత్వం వహించారు. ఈ సందర్బంగా దర్శకుడు నాగరాజు తలారి మాట్లాడతూ… ఈ చిత్రం యాక్షన్ సెంటిమెంట్ కామెడీ రూపొందించబడుతుంది.ఈ చిత్రాన్ని హైదరాబాద్ , గోవా, బెంగళూరు పరిసర ప్రాంతాలలో షూటింగ్ మూడు షెడ్యూల్డ్ లో కంప్లీట్ అవుతుంది .

ఈ చిత్రములో మూడు ఫైట్లు , ఐదు పాటలు ఉంటాయి. హీరో అభయ్ మాట్లాడుతూ… ఇది నా రెండవ మూవీ , మొదటి చిత్రం “సుడిగాలి ” రిలీజ్ సిద్ధంగా ఉంది నన్ను నా యాక్టింగ్ ను నమ్మి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తప్పకుండా ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.

నిర్మాతలు మాట్లాడతూ… దర్శకుడు చెపిన కథ చాలా బాగా నచ్చి ,సంగీత దర్శకుడు ఇచ్చిన మంచి ట్యూన్స్ విని , ఖర్చుకు వెనక కాకుండా సినిమా ను నిర్మించటానికి రెడీ అయ్యామన్నారు.

హీరోయిన్ గీత్ షా మాట్లాడుతూ… తెలుగు ప్రేక్షకులకు “వైరస్” మూవీ ద్వారా పరిచయం అయ్యాను. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడతూ ఈ చిత్రం లో ఐదు పాటలు బాగావచ్చాయని, కథకు తగ్గట్టు రీరికార్డింగ్ కు స్కోప్ ఉన్న చిత్రం అన్నారు. ఇంకా ఈ చిత్రములో షమ్ము , బిల్లా బ్రదర్స్ ,ప్రియాంక, చంద్రకాంత్. తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి : కెమెరా- రవి బైపల్లి, మాటలు కోదండరాం జ్వాలపురం , రాజు వైట్ల.పాటలు- శ్రీను సాగర్..సంగీతం- ర్యాప్ రాక్ షకీల్. నిర్మాతలు : అంజనప్ప , నాగరాజ , కథ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం : నాగరాజు తలారి.

User Comments