త్రివిక్ర‌మ్ ఇంక మార‌డా..?

Last Updated on by

త్రివిక్ర‌మ్ సినిమా అంటే మొన్న‌టి వ‌ర‌కు ఓ అద్భుతం. ఏం చేసైనా ఆయ‌న హిట్టిస్తాడు.. చెత్త సినిమా మాత్రం చేయ‌డు అనే గుడ్డి న‌మ్మ‌కం. అందుకే హీరోలు కూడా త్రివిక్ర‌మ్ డేట్స్ అడ‌గ్గానే మారు మాట మాట్లాడ‌కుండా ఇస్తారు. చివ‌రికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఫోన్ లో రెండు నిమిషాలు క‌థ విని అజ్ఞాత‌వాసి చేసాడు. మాట‌ల మాంత్రికుడిపై ఉన్న న‌మ్మ‌కంతో ఎదురు చెప్ప‌లేదు. దాని ఫ‌లితం ఎలా వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకే ఫోన్ క‌థ‌లు కాకుండా కూర్చోబెట్టి నెల‌లు నెల‌లు క‌థ సిద్ధం చేయించాడు ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ స‌గానికి పైగా పూర్త‌యింది కూడా. అయితే ఈ చిత్రం జ‌రుగుతున్న తీరుపై ఎన్టీఆర్ మాత్రం సంతృప్తిగా లేడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా త్రివిక్ర‌మ్ తీసుకున్న క‌థ ఎన్టీఆర్ కి పెద్ద‌గా ఎక్క‌డం లేద‌ని తెలుస్తుంది. అత్తారింటికి దారేది.. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సీన్స్ ఎక్కువ‌గా రిపీట్ అవుతున్న నేప‌థ్యంలో మ‌రోసారి త్రివిక్ర‌మ్ కు క‌థ మార్చాల్సిందిగా ఎన్టీఆర్ కోరుతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఎంద‌కుంటే ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు జూనియ‌ర్. జై ల‌వ‌కుశ‌తో యావరేజ్ అందుకున్నా కూడా న‌టుడిగా స‌క్సెస్ అయ్యాడు. ఇలాంటి టైమ్ లో త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేత కానీ ఏదైనా తేడా కొడితే అది ఎన్టీఆర్ కెరీర్ కు ప్ర‌మాదం. అందుకే త‌న కెరీర్ పై తానే దృష్టి పెడుతున్నాడు. మాట‌ల మాంత్రికున్ని న‌మ్మాడు కాబ‌ట్టే మ‌ళ్లీ మ‌ళ్లీ త‌న‌కు కావాల్సినట్లుగా క‌థ‌లో మార్పులు చేయించుకుంటున్నాడు నంద‌మూరి చిన్నోడు. అక్టోబ‌ర్ లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. మ‌రి ఎన్టీఆర్ న‌మ్మ‌కాన్ని త్రివిక్ర‌మ్ ఎంత‌వ‌ర‌కు నిల‌బెడ‌తాడో ఆ దేవుడికే తెలియాలి.

User Comments