Last Updated on by
ఒకటి మిస్ అయితే.. మరోటి మన కోసం వేచి చూస్తుందని అర్థం. ప్రతీచోట ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ ఉంటుంది. అది మనకు తెలియదంతే. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈయన బిగ్ బాస్ సీజన్ 2 నుంచి తప్పుకున్నాడు. దానికి కారణం సినిమాలతో బిజీగా ఉండటమే. రాజమౌళితో పాటు త్రివిక్రమ్ సినిమాతోనూ బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్. ఇలాంటి టైమ్ లో బిగ్ బాస్ 2 అంటే కాస్త కష్టమే. కానీ బిగ్ బాస్ వదిలేసినా కూడా ఇప్పుడు మరో బ్రాండ్ వచ్చి ఎన్టీఆర్ చెంత చేరింది. అదే ఐపిఎల్ సీజన్. అవును.. క్రికెట్ ప్రియులను తనదైన వాయిస్ తో మాయ చేయబోతున్నాడు జూనియర్.
ఏప్రిల్ 7 నుంచి మొదలు కాబోయే ఐపిఎల్ తెలుగు వర్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు ఎన్టీఆర్. స్టార్ గ్రూప్ లోకి ఈ ఏడాది నుంచి ఐపిఎల్ వచ్చేసింది. సోనీ నుంచి ఐదేళ్ల కాంట్రాక్ట్ ను తీసుకుంది స్టార్ గ్రూప్. దీనికోసం ఏకంగా 16 వేల 400 కోట్లకు పైగా ప్యాకేజ్ చెల్లించింది స్టార్ యాజమాన్యం. తెలుగులోనే కాదు.. ప్రతీ భాషకు ఓ స్టార్ ను వాళ్లు బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంటున్నారు. అలా మొత్తానికి బిగ్ బాస్ మిస్ అయినా ఇప్పుడు ఐపిఎల్ వచ్చి ఎన్టీఆర్ చెంత చేరింది. దాంతో లెక్క సరిపోయింది.
User Comments