ఎన్టీఆర్ ఛాలెంజ్ చేసాడు

Last Updated on by

ఇది ఇండియా.. ఒక్క‌సారి ఏదైనా మొద‌లైందంటే అది అంత ఈజీగా ఆగ‌దు. అది మంచైనా చెడైనా కూడా. ఇప్పుడు మినిస్టర్ రాజ్యవర్ధన్ రాథోర్ చేసిన ఒక్క‌ప‌ని ఇండియా మొత్తాన్ని ఊపేస్తుంది. స్టాలిన్ సినిమాలో చిరంజీవి మాదిరి నువ్వు ముగ్గురికి సాయం చేయ్.. ఆ ముగ్గుర్ని మ‌రో ముగ్గురికి సాయం చేయ‌మ‌ని చెప్పు అంటాడు క‌దా..! ఇప్పుడు హ‌మ్ ఫిట్ హై తో ఇండియా ఫిట్ హై అంటూ ఓ కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టాడు రాజ్యవర్ధన్ రాథోర్. అందులో ఒక‌రు త‌మ ఫిట్ నెస్ చూపించుకుని మ‌రో ముగ్గురికి ఆ ఛాలెంజ్ విస‌రాలి. ఇప్ప‌టికే ఇండియా అంతా పాకిపోయింది అది.

ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అంతా ఇదే ప‌నిమీద బిజీగా ఉన్నారిప్పుడు. ఇప్ప‌టికే చైతూ.. స‌మంత‌.. ఎన్టీఆర్ ఇలా చాలా మంది ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ స్వీక‌రించారు. ఎన్టీఆర్ కు మోహ‌న్ లాల్ ఈ ఛాలెంజ్ ఇస్తే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఇది చేసి చ‌ర‌ణ్, క‌ళ్యాణ్ రామ్, మ‌హేష్ బాబు ల‌కు త‌న ఛాలెంజ్ విసిరాడు. పైగా చ‌ర‌ణ్ చూస్తాడో లేదో అని ఉపాస‌న‌ను గుర్తు చేయ‌మ‌ని చెప్పాడు యంగ్ టైగ‌ర్. వాళ్లు కూడా సిద్ధంగా ఉంటారు. రేపోమాపో ఇటు చ‌ర‌ణ్.. అటు మ‌హేష్.. మ‌రోవైపు క‌ళ్యాణ్ రామ్ కూడా త‌మ ఫిట్ నెస్ చూపించుకోడానికి రెడీ అవుతున్నారు. ఇది కూడా ఆరోగ్యా నికి మంచిదేలె..!

User Comments