ఫ్లాష్.. ఎన్టీఆర్ జై లవ కుశ స్టోరీ మొత్తం ఇదే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ‘జై లవ కుశ’ సినిమా చేస్తూ బిజీబిజీగా గడిపేస్తోన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాతో తొలిసారి ఎన్టీఆర్ కూడా త్రిపాత్రాభినయం చేస్తుండటంతో.. అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే కష్టపడాల్సి వస్తుందని సమాచారం.

అయినా సరే అక్కడుంది ఎన్టీఆర్ కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా షూటింగ్ సాఫీగా వెళ్ళిపోతుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే, ఇంతకుముందు ఈ సినిమాలో జై అనే నెగిటివ్ క్యారెక్టర్ తో ఎన్టీఆర్ విలనిజం పీక్స్ లో ఉంటుందని, సినిమా కథ ఇలా ఉండబోతుందని రకరకాలుగా వార్తలు వినిపించిన విషయం గుర్తుండే ఉంటుంది.

అవి ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం సినిమా మొత్తం కథ ఇదే అంటూ సినీ సర్కిల్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుండటం హాట్ టాపిక్ గా మారింది.

ఆ స్టోరీలోకి వెళితే, ‘జై లవ కుశ’ కథ ప్రధానంగా ఇద్దరు కవల సోదరులు, వారిని చంపేందుకు తిరిగే ఓ అన్న చుట్టూ తిరుగుతుందని..

ఈ ముగ్గురికీ ఒకే తండ్రి గాని తల్లులు మాత్రం ఇద్దరు ఉండటమే పగ కు కారణమని ఇన్నర్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది.

అంతేకాకుండా కథలో మొదటి భార్యకు పుట్టినవాడే జై కావడం, రెండో భార్యకు పుట్టిన కవలలు లవ కుశ కావడం..

ఈ క్రమంలో తండ్రి వల్లే తన తల్లి చనిపోయిందని, అందుకే తండ్రిని అతని కుటుంబాన్ని నాశనం చేయాలని జై అనుకుంటూ ముందుకెళ్లడంతో కథ నడుస్తుందని సమాచారం.

ఇదే సమయంలో తండ్రి తనను చిన్నప్పుడే వదిలి వెళ్లిపోవడంతో జై చెడు సావాసాలతో పెద్ద గ్యాంగ్ స్టర్ గా, నాయకుడిగా ఎదుగుతాడని..

మరోవైపు తండ్రి తోనే ఉంటూ లవకుశలు డ్రామా ఆర్టిస్టులుగా జీవిస్తుంటారని, దీంతో రౌడీయిజం చేసే అన్నయ్యకి – డ్రామాలు వేసుకునే తమ్ముళ్ళకి మధ్యలో నడిచే ఓ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా జై లవ కుశ సినిమా ఉంటుందని ప్రస్తుతం టాక్ కొంచెం గట్టిగానే వినిపిస్తుంది.

అదే విధంగా ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడని, సినిమా మొత్తం దాదాపుగా పోసాని పాత్ర చుట్టూనే తిరుగుతుందని ప్రచారం జరుగుతుండటంతో.. ఎన్టీఆర్ తండ్రిగా కనిపించబోయేది ఆయనేనేమో అనిపిస్తోంది.

మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో.. నిజమైతే ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Follow US