నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ కు మ‌హేష్ ప్రాణం

Last Updated on by

అవును.. మీరు చూస్తున్న‌ది నిజ‌మే. ఇప్పుడు నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ కు మ‌హేష్ ప్రాణంగా నిలుస్తున్నాడు. ఓ హీరో కానీ.. హీరోయిన్ కానీ కెరీర్ లో బాగా పైకి రావాలంటే కావాల్సింది మంచి మేనేజ‌ర్. వాళ్లు స‌రిగ్గా ఉంటే సెలెబ్రెటీస్ కెరీర్ కు వ‌చ్చే న‌ష్ట‌మేం లేదు. బాలీవుడ్ లో ఇదే జ‌రుగుతుంది. అక్క‌డ మేనేజ‌ర్స్ మొత్తం చూసుకుంటారు. క‌థల విష‌యం నుంచి ప్ర‌తీ ఒక్క‌టి ప‌క్కనే ఉండి ప్రాణం పెడ‌తారు. అద్భుత‌మైన క‌థ‌లు బాలీవుడ్ లో ఎక్కువ‌గా ఎందుకు వ‌స్తున్నాయంటే కార‌ణం కూడా ఇదే. తెలుగులో కూడా ఇప్పుడు ఇలాంటి క‌ల్చ‌ర్ వ‌స్తుంది. ట్రెండ్ కు త‌గ్గ‌ట్లుగా మ‌న హీరోలు మారుతున్నారు. మంచి మేనేజ‌ర్స్ ను పెట్టుకుంటున్నారు. వాళ్లే అంతా మేనేజ్ చేస్తున్నారు. కావాలంటే ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ నే తీసుకోండి. ఈయ‌న కెరీర్ ఇప్పుడు ప‌రుగులు తీస్తుంది. దానికి కార‌ణం మ‌హేష్ కోనేరు.Jr NTR Kalyan Ram Brothers Most Trusted Person Maheshప‌దిహేనేళ్ల కెరీర్ లో ప‌ట్టుమ‌ని ప‌ది సినిమాలు చేయ‌లేదు క‌ళ్యాణ్ రామ్. కానీ ఇప్పుడు ఆయ‌న ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు మ‌రో సినిమా కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు. అస‌లు క‌ళ్యాణ్ రామ్ నుంచి ఈ జోరు ఊహించ‌డ‌మే క‌ష్టం. కానీ మ‌హేష్ కోనేరు వ‌చ్చిన త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ కెరీర్ స్టైల్ మారిపోయింది. ఈ మ‌ధ్యే ఎమ్మెల్యే సినిమా చేసాడు.. ఇప్పుడు మ‌హేష్ నిర్మాణంలో నా నువ్వే సినిమా పూర్తి చేసాడు. ఇది ఇలా పూర్తైందో లేదో అప్పుడే ప‌వ‌న్ సాధినేనితో ఓ సినిమా అనౌన్స్ చేసాడు. ఈ సినిమాలో హ‌రికృష్ణ కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తార‌ని తెలుస్తుంది. ఇక దాంతో పాటే ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శ‌కుడిగా ఓ సినిమాకు క‌మిట‌య్యాడు క‌ళ్యాణ్ రామ్. ఈ చిత్రం ఏప్రిల్ 25న మొద‌లు కానుంది. ఇలా ఒకే ఏడాది ఒకేసారి మూడు సినిమాలు క‌ళ్యాణ్ రామ్ నుంచి ఊహించ‌డం మాత్రం నిజంగా అద్భుత‌మే.Jr NTR Kalyan Ram Brothers Most Trusted Person Maheshక‌ళ్యాణ్ రామ్ కెరీర్ ఇంత‌గా జోరు అందుకోడానికి ముఖ్య కార‌ణం ఆయ‌న మేనేజ‌ర్ మ‌హేష్ కోనేరు. గ‌తంలో ఎన్టీఆర్ సినిమాల‌కు ప‌ని చేసాడు మ‌హేష్. ఆయ‌నతోనే ఉండి అన్ని ప‌నులు చూసుకునేవాడు. మ‌హేష్ ప‌నితీరు న‌చ్చి ఆ త‌ర్వాత అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ కు కూడా ఈయ‌న్ని చేరువ చేసాడు. క‌ళ్యాణ్ రామ్ ద‌గ్గ‌రికి మ‌హేష్ వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న కెరీర్ ఎలా మారిందో ఇప్పుడు ఆ ఫ‌లితం క‌నిపిస్తుంది. దాంతో అటు ఎన్టీఆర్.. ఇటు క‌ళ్యాణ్ రామ్ ఇద్ద‌రూ మ‌హేష్ వ‌ర్క్ కు ఫిదా అయిపోతున్నారు. నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రికి ఇప్పుడు మ‌హేష్ కావాల్సినవాడుగా మారిపోయాడు. ఎన్టీఆర్ డేట్స్ తో పాటే ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ కు కూడా ఆప్తుడు అయిపోయాడు. ఆయ‌న ద‌గ్గ‌రికి మంచి క‌థ‌లు తీసుకెళ్ల‌డానికి మ్యాగ్జిమ‌మ్ ట్రై చేస్తున్నాడు మ‌హేష్. ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తి కళ్యాణ్ రామ్ తో సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇలా త‌మ్ముడు.. అన్న‌య్య‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు మ‌హేష్ కోనేరు.

User Comments