ఎన్టీఆర్ వెనుక అసలేం జరుగుతోంది?

Last Updated on by

జూనియర్ ఎన్టీఆర్ వెనుక అసలేం జరుగుతోంది? నందమూరి ఫ్యామిలీతో తొలి నుంచి విబేధాలున్న నేపథ్యంలో హరికృష్ణ మరణంతో అవి సమసిపోయినట్లు ప్రచారమైతే తెరపైకి వచ్చింది గానీ! అందులో వాస్తవం లేదని తర్వాతి రోజుల్లో నిర్ధారించుకోవాల్సి వచ్చింది. తాతయ్య ఎన్టీఆర్ బయోపిక్ పై పరిశ్రంమంతా ముక్త కంఠగా స్పందించినా..తారక్ మాత్రం ఎక్కడా ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఈనేపథ్యంలో ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. సినిమా ఎంత నచ్చకపోయినా కనీసం చిన్న ట్వీట్ అయినా వేయకపోతాడా? అని అంతా భావించారు. తారక్ మౌనానికి అసలు కారణం అదా? లేక అంతకు మించిన బలమైన కారణం ఉందా? అని చాలా మందిలో మీమాంస ఉంది.

అటుపై ఎపీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ గురించి ఒక్కసారిగా కూడా మాట్లాడలేదు. అదే సమయంలో ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు వైసీపీలో చేరడం? తారక్ స్తబ్దుగా ఉండటం ఇలా ఎన్నో సందేహాలు అభిమానుల బుర్రల్ని తొలిచేస్తున్నాయి. ఇక ఎన్టీర్ బర్త్ డే నాడు తండ్రి స్వర్గస్తులైన నేపత్య0లో వేడుకలకు దూరంగా ఉండాలని అభిమానులకు పిలిపునిచ్చారు. దీంతో వాళ్లు ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్ గా విషెస్ చెప్పారు. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరూ కూడా తారక్ శుభాకాంక్షలు చెప్పకపొవడం గమనార్హం.

తమ్మడు తమ్మడు అంటూ వెంటపడే కళ్యాణ్ రామ్ సైతం మౌనంగా ఉండటం అభిమానుల్లో మరింత ఆందోళనకు దారితీస్తోంది. ఇక నారా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ స్పందించింది లేదు. కొంతమంది డై హార్డ్ ఫ్యాన్స్ తారక్ ఇంటి వద్దకు వచ్చి విషెల్ తెలిపారు. అదే సమయంలో ఎన్టీఆర్ అభిమానులు ఎన్నడు లేని విధంగా సిఎం సిఎం అంటూ నినాదాలు చేసారు. వాళ్లకు తారక్ చిరు నవ్వు నవ్వుతూ అభివాదం చేసాడు. వాళ్లను ఉద్దేశించి మాట్లాడింది లేదు. దీంతో తారక్ మౌనం దేనికి సంకేతం? తారక్ వెనుక అసలేం జరుగుతుందో? అర్ధం కాని పరిస్థితులు తలెత్తాయి.