త్రివిక్రమ్ కోసం తగ్గుతున్న ఎన్టీఆర్..! 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ‘జై లవ కుశ’ అంటూ ఓ క్రేజీ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. తొలిసారిగా ఎన్టీఆర్ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తుండటం.. అందులో రావణుడి లాంటి ఓ నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేస్తుండటంతో అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని అంటాయి. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి ఎన్టీఆర్ రెడీగా ఉన్నాడని ఇప్పటికే కొన్నిసార్లు చెప్పుకున్నాం. ఈ క్రేజీ కాంబోను ఎన్టీఆరే ఏరికోరి సెట్ చేసుకున్నాడని.. త్రివిక్రమ్ తో పని చేయాలనే ఆశతో తనే సినిమా చేసిపెట్టమని అడిగాడని కూడా వార్తలు వినిపించాయి.
అంతేకాకుండా ఇప్పటికే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ప్రాజెక్టుకు సంబంధించి స్టోరీ కూడా ఓకే అయిపోయిందని.. స్క్రిప్ట్ కూడా చివరి దశకు వచ్చేసిందని టాక్ వినిపిస్తుంది. మరోవైపు, పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ చేస్తోన్న తాజా సినిమా ప్రస్తుతం అనుకున్న టైమ్ కంటే కొంచెం లేట్ గానే అవుతుండటంతో.. ఎన్టీఆర్ తో సినిమా కూడా కొంచెం వెనక్కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈలోపు ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ ఓ పని అప్పగించాడని తెలియడం ఇప్పుడు సినీ సర్కిల్ లో ఆసక్తికరంగా మారింది. ఆ స్టోరీలోకి వెళితే, జై లవ కుశ సినిమా ఈ దసరా కానుకగా రెడీ అవుతూ చివరి దశకు వచ్చేయడంతో ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్ పై ఓ లుక్కేశాడట.
ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ రీసెంట్ గా ఎన్టీఆర్ కోసం అనుకున్న కథ ప్రకారం.. హీరో కొంచెం స్లిమ్ గా ఉండి ఫిట్ గా కనిపిస్తే బాగుంటుందని చెప్పాడట. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ ఇచ్చిన సూచనల మేరకు ఎన్టీఆర్ అప్పుడే పాత్రకు తగ్గట్లు మారే పనిలో పడ్డాడని తాజా ఇన్నర్ టాక్. అంతేకాకుండా ఈ క్రమంలో తాజాగా నిపుణుల సమక్షంలో జిమ్ చేస్తూ తన డైట్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాడని టాక్ వినిపిస్తుంది. మరి ఇదే నిజమైతే, పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న సినిమాను తొందరగా పూర్తి చేసి ఎన్టీఆర్ తో సినిమాను త్రివిక్రమ్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తాడో చూడాలి. అలాగే తనకోసం తగ్గుతున్న ఎన్టీఆర్ ను స్లిమ్ గా ఫిట్ గా ఎలా చూపిస్తాడో చూడాలి.