వామ్మో.. ఎన్టీఆర్ మామూలోడు కాడు

ఏమో అనుకున్నాం కానీ ఎన్టీఆర్ అనుకున్నంతా చేసాడు. అస‌లు ఈయ‌న మారిన తీరు చూసి ఇప్పుడు అంతా షాక్ అయిపోతున్నారు. కొత్త సినిమా కోసం పూర్తిగా త‌న లుక్ మార్చుకున్నాడు యంగ్ టైగ‌ర్. త్రివిక్ర‌మ్ చెప్పాడ‌నో లేదంటే తానే నిజంగా మారిపోవాల‌ని అనుకున్నాడో తెలియ‌దు కానీ ఇప్పుడు జూనియ‌ర్ కొత్త లుక్ మాత్రం ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుంది. ఈ చిత్రం కోసం కొన్ని నెల‌లుగా ఫుల్ డైట్ లో ఉన్నాడు ఈ హీరో. ఫుడ్ విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. దీనికోస‌మే ప్ర‌త్యేకంగా ఓ ట్రైనర్ ను కూడా పెట్టుకున్నాడు. ఇష్ట‌మైన ఫుడ్ ను పూర్తిగా త్యాగం చేసాడు. డైట్ లో భాగంగా తాను తినే ఆహారంలో ఎగ్ వైట్స్, చికెన్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటున్నాడు. స్నాక్స్ రూపంలో ఆల్మండ్స్.. వాల్నట్స్ మాత్రమే తీసుకుంటున్నాడు. రోస్టెడ్ చికెన్, ఫ్రైడ్ మటన్, ఫిష్ ను రెండు పూట‌ల తీసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది. ఇదంతా ప్రముఖ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్ ఆధ్వర్యంలో జ‌రుగుతుంది.

సినిమా సినిమాకు ద‌ర్శ‌కుల‌కు కావాల్సిన‌ట్లుగా మారిపోతున్నాడు ఎన్టీఆర్. టెంప‌ర్ నుంచి లుక్స్ విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు ఎన్టీఆర్. టెంప‌ర్ లో కొత్త‌గా క‌నిపించాడు.. ఆ త‌ర్వాత నాన్న‌కు ప్రేమ‌తోలో మ‌రింత కొత్త‌గా మారిపోయాడు. ఇక జ‌న‌తా గ్యారేజ్, జై ల‌వ‌కుశ‌ల్లోను ఇది వ‌ర‌కు ఎన్టీఆర్ కాదు. ఇప్పుడు త్రివిక్ర‌మ్ కోసం పూర్తిగా వేష‌మే మార్చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. దాంతో ఈ పాత్ర కోసం ఫుల్ డైట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాలో క‌నిపించ‌నంత ఫ్రెష్ లుక్ ఇందులో ఉండ‌బోతుంది. ఇప్ప‌టికే చాలా మారిపోయాడు ఎన్టీఆర్.

తాజాగా బ‌య‌టికి వ‌చ్చిన ఫోటో ఒక‌టి ఇప్పుడు ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేయిస్తుంది. కెరీర్ కొత్త‌లో సున్నండ‌లా ఉండేవాడు ఎన్టీఆర్. త‌ర్వాత ఆ రూపం మ‌రింత పెరిగిపోయింది. కానీ య‌మ‌దొంగ కోసం కొత్త లుక్ లోకి వెళ్లి షాక్ ఇచ్చాడు. అప్ప‌ట్నుంచీ మ‌రీ లావు కాకుండా జాగ్ర‌త్త‌పడినా.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఊస‌ర‌వెల్లి, జ‌న‌తా గ్యారేజ్ లో ఒళ్లు చేసిన‌ట్లు క‌నిపించాడు ఎన్టీఆర్. కానీ పాత రూపంలోకి మాత్రం వెళ్ల‌లేదు. ఇప్పుడు త్రివిక్ర‌మ్ కోసం మ‌రోసారి కొత్త‌గా మారిపోయాడు ఎన్టీఆర్. ఈ చిత్రం మార్చ్ 23 నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమా కోసం ప‌ర్ ఫెక్ట్ డైట్ ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. మొత్తానికి ఇన్నాళ్ళ క‌ష్ట‌మంతా ఒక్క లుక్ కు వ‌చ్చిన రెస్పాన్స్ తో మ‌రిచిపోయాడు జూనియ‌ర్.