చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌కు అరెస్ట్ వారెంట్

Last Updated on by

అదేంటి ఈ ఇద్ద‌రు హీరోలు ఏం చేసారు అరెస్ట్ వారెంట్ ఇవ్వ‌డానికి అనుకుంటున్నారా..? అంత త‌ప్పు వీళ్లేం చేయ‌లేదు. కాక‌పోతే రాజ‌మౌళితో సినిమా క‌మిట‌య్యారు అంతే. రాజ‌మౌళి సినిమా అంటే జైలుతోనే స‌మానం. ఆ సినిమా చేసిన‌న్ని రోజులు మ‌రో సినిమాపై దృష్టి పెట్టే స‌మ‌యం కూడా ఉండ‌దు. ఇక అరెస్ట్ వారెంట్ అంటే ఆర్నెళ్ళ ముందుగానే అన్నీ సిద్ధం చేసుకుని ఉంచండి అంటూ ఓ వార్నింగ్ అన్న‌మాట‌. ఇప్పుడు ఇదే చేస్తున్నాడు రాజ‌మౌళి. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఇద్ద‌రూ త‌మ త‌మ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. అక్టోబ‌ర్ నుంచి రాజ‌మౌళి సినిమాతో వీళ్లిద్ద‌రూ బిజీ కానున్నారు. ఆలోపే త‌మ సినిమాల‌ను పూర్తి చేసుకోవాలంటూ ఇప్ప‌టికే రాజ‌మౌళి నుంచి ఆదేశాలు వెళ్లాయి.

ఇక రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌కు కూడా ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు జ‌క్క‌న్న‌. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కనుంది. బాక్సింగ్ నేప‌థ్యంలో క‌థ సిద్ధం చేస్తున్నాడు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్. ఇప్ప‌టికే తండ్రి చెప్పిన మూడు వ‌ర్ష‌న్స్ రాజ‌మౌళికి న‌చ్చ‌క‌పోవ‌డంతో మ‌రో వ‌ర్ష‌న్ రాస్తున్నాడు విజ‌యేంద్రుడు. ఇక సినిమా మ‌రో నెల‌లో ప‌ట్టాలెక్కుతుంది అనుకున్న‌పుడు ఇటు చ‌ర‌ణ్.. అటు ఎన్టీఆర్ కు ప్ర‌త్యేకంగా ఓ ట్రైనింగ్ పీరియ‌డ్ పెట్ట‌నున్నాడు రాజ‌మౌళి. బాక్సింగ్ లో ఇద్ద‌రికి అఫీషియ‌ల్ ట్రైనింగ్ ఇప్పించ‌నున్నాడు జ‌క్క‌న్న‌. సై టైమ్ లో ర‌గ్బీ.. బాహుబ‌లి టైమ్ లో క‌త్తి సాములు చేసిన‌ట్లు ఇప్పుడు బాక్సింగ్ కోసం ఇద్ద‌ర్ని హౌజ్ అరెస్ట్ చేయ‌బోతున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. అగ్గ‌దీ సంగ‌తి.. ఇప్పుడు చెప్పండి అరెస్ట్ వారెంట్ కాక‌పోతే మ‌రేంటి..?

User Comments