ఎన్టీఆర్ ను కష్టపెడుతున్న త్రివిక్ర‌మ్

Last Updated on by

అదేంటి.. ఒక్క ఫ్లాప్ వ‌స్తే ద‌ర్శ‌కుడితో హీరోకు ఇబ్బందులు వ‌చ్చేస్తాయా అనుకుంటున్నారా..? విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇప్పుడు ఇదే నిజం. ఎన్టీఆర్ కు త్రివిక్ర‌మ్ క‌ష్టాలు అయితే ఖచ్చితంగా త‌ప్పేలా లేవు. ఆ క‌ష్టాలు క‌థ విష‌యంలోనో.. మ‌రేంటో కాదు.. బ‌రువు విష‌యంలో. అవును.. ఎన్టీఆర్ కు మ‌రోసారి వెయిట్ క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. కెరీర్ కొత్త‌లో ఎన్టీఆర్ ఎలా ఉండేవాడో ఒక్క‌సారి ఊహించుకోండి. సున్నుండ గుర్తొస్తుంది క‌దా.. నిండుగా చూడ్డానికి బొద్దుగా ముద్దుగా ఉండేవాడు జూనియ‌ర్. అందుకే ఆదిలో సున్నుండ తీసుకో అంటూ పాట కూడా పెట్టాడు వినాయ‌క్. రాఖీ టైమ్ వ‌చ్చేస‌రికి మ‌రీ చూడ్డానికి కూడా ఇబ్బందిగా అనిపించేంత బ‌రువు పెరిగిపోయాడు ఎన్టీఆర్.

అది చూసిన త‌ర్వాతే ఎన్టీఆర్ తో చెమ‌ట‌లు క‌క్కించి మ‌రీ య‌మ‌దొంగ‌లో స్లిమ్ చేయించాడు రాజ‌మౌళి. అది మొద‌లు ఇప్ప‌టి వ‌ర‌కు లావెక్క‌లేదు ఎన్టీఆర్. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఊస‌ర‌వెల్లి, జ‌న‌తా గ్యారేజ్ లో కాస్త ఒళ్లు చేసిన‌ట్లు క‌నిపించినా.. పాత రూపంలోకి అయితే మార‌లేదు. కానీ సీన్ చూస్తుంటే.. ఆ సీన్ త్వ‌ర‌లోనే వ‌చ్చేలా క‌నిపిస్తోంది. మొన్న జై ల‌వ‌కుశ‌లో కూడా కాస్త బొద్దుగా క‌నిపించాడు. ఇప్పుడు మ‌ళ్లీ ఆ కొవ్వు క‌రిగించే ప‌నిలో ఉన్నాడు ఈ హీరో. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమాకు క‌మిట‌య్యాడు ఎన్టీఆర్. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌డానికి మ‌రో నెల టైమ్ ఉంది. మార్చ్ 23 నుంచి ఇది సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమా కోసం ప‌ర్ ఫెక్ట్ డైట్ ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్.

ఇది ఓ డిటెక్టివ్ డ్రామా అని తెలుస్తుంది. ఇందులో ఎన్టీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని కొత్త కారెక్ట‌ర్ లో క‌నిపించ‌బోతున్నాడు. అందుకే ఈ పాత్ర కోసం త్రివిక్ర‌మ్ ఖచ్చితంగా బ‌రువు త‌గ్గాలంటూ కండీష‌న్ పెట్టాడు. దాంతో మ‌రో ఆప్ష‌న్ లేక ఓకే అనేసాడు జూనియర్. కొన్ని రోజులుగా ప‌ర్స‌న‌ల్ గా ఓ ట్రైన‌ర్ ను పెట్టుకుని మ‌రి డైట్ ఫాలో అవుతున్నాడు. త్రివిక్ర‌మ్ సినిమాకే కాదు.. ఎలాగూ రాజ‌మౌళి సినిమాకు కూడా ఈ డైట్ అవ‌స‌రం. అది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చే సినిమా. దాంతో అది కూడా ఖచ్చితంగా స‌న్న‌గా మారాల్సిందే. అందుకే ఒకేదెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్లు.. ఒక్క డైట్ తో రెండు సినిమాలు వ‌ర్క‌వుట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ప్ర‌స్తుతానికి జిమ్ లో చెమ‌టోడుస్తున్నాడు జూనియ‌ర్. మొత్తానికి ఎన్టీఆర్ కు వెయిట్ క‌ష్టాలు మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చాయి.

User Comments