పాపం.. త్రివిక్ర‌మ్ కష్టాలు ఎన్టీఆర్ కోసం

త్రివిక్ర‌మ్ సినిమా అంటే మొన్న‌టి వ‌ర‌కు ఓ అద్భుతం. ఏం చేసైనా ఆయ‌న హిట్టిస్తాడు.. చెత్త సినిమా మాత్రం చేయ‌డు అనే గుడ్డి న‌మ్మ‌కం. అందుకే హీరోలు కూడా త్రివిక్ర‌మ్ డేట్స్ అడ‌గ్గానే మారు మాట మాట్లాడ‌కుండా ఇస్తారు. చివ‌రికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఫోన్ లో రెండు నిమిషాలు క‌థ విని అజ్ఞాత‌వాసి చేసాడు. మాట‌ల మాంత్రికుడిపై ఉన్న న‌మ్మ‌కంతో ఎదురు చెప్ప‌లేదు. దాని ప్రభావమే ఇప్పుడు అజ్ఞాత‌వాసి దారుణ‌మైన ఫ‌లితం. ఇక ఇప్పుడు త్రివిక్ర‌మ్ చెప్పింద‌ల్లా చేయ‌డానికి హీరోలు సిద్ధంగా లేరు. క‌చ్చితంగా ఇదివ‌ర‌కు ఆటిట్యూడ్ చూపిస్తే త‌గ‌దు.. ఇప్పుడు క‌చ్చితంగా త‌గ్గాల్సిందే..! ప్ర‌స్తుతం ఈయ‌న ఎన్టీఆర్ తో సినిమాకు క‌మిట‌య్యాడు. అజ్ఞాత‌వాసి ఫ‌లితం చూసిన త‌ర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు యంగ్ టైగ‌ర్ కూడా కాస్త కంగారులో ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఈ విష‌యంపై నిర్మాత రాధాకృష్ణ కూడా త‌న హీరోను ప్ర‌త్యేకంగా క‌లిసిన‌ట్లు వార్త‌ల వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ సినిమా విష‌యంలో త్రివిక్ర‌మ్ చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ని ఆయ‌న చెప్పిన‌ట్లు వార్తలొస్తున్నాయి.

ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఫిబ్ర‌వరిలో మొద‌లు పెట్టాలి. కానీ ఈ విష‌యంలో త్రివిక్ర‌మ్ ఇంకాస్త టైమ్ కావాల‌ని అడిగిన‌ట్లు తెలుస్తుంది. ఫిబ్ర‌వ‌రి నుంచి అనుకున్న షూటింగ్ కాస్తా.. మార్చ్ కు వెళ్లిపోయేలా కనిపిస్తుంది. ఈ లోపు ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్లు ఫిజిక్ ను మార్చుకుంటున్నాడు. ఇక్క‌డ ఎన్టీఆర్ కోసం త్రివిక్ర‌మ్ కాస్త త‌గ్గ‌క త‌ప్ప‌ట్లేదు. అజ్ఞాత‌వాసి ఫ‌లితాన్ని చూపించి ఇప్పుడు త్రివిక్ర‌మ్ ను చిన్న‌ కోరిక ఒక‌టి కోరుతున్నాడు యంగ్ టైగ‌ర్. అదే సంగీత ద‌ర్శ‌కుడి మార్పు.

అజ్ఞాత‌వాసి ఫ్లాపైనా త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని.. నీపై నాకు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని త్రివ‌క్ర‌మ్ కు ఎన్టీఆర్ భరోసా ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. అయితే మ్యూజిక్ డైరెక్ట‌ర్ విష‌యంలో మాత్రం మ‌న‌సు మార్చుకోవాల్సిందే అని త్రివిక్ర‌మ్ కు ఎన్టీఆర్ అల్టిమేటం పెట్టిన‌ట్లు తెలుస్తుంది. అజ్ఞాత‌వాసి సంగీతం విష‌యంలో చాలా విమ‌ర్శ‌లే వ‌చ్చాయి. అనిరుధ్ కు తెలుగు మ్యూజిక్ పెద్ద‌గా సెట్ కాలేద‌ని.. మ‌న హీరోల ఇమేజ్ ఆయ‌న‌కు తెలియ‌ద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇదే ఫీల్ అవుతున్నాడు. అందుకే త‌న సినిమాకు అనిరుధ్ ను కాద‌ని.. దేవీని తీసుకోవాల‌ని కోరుతున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రి దీనిపై ఈయ‌న ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు. ఆ మ‌ధ్య దేవి, త్రివిక్ర‌మ్ మ‌ధ్య గొడ‌వైంది. అందుకే క‌లిసి ప‌ని చేయ‌డం మానేసారు. మ‌రిప్పుడు ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ ఎవ‌రి కోసం ఎవ‌రు ఇగో చంపుకుంటారో.. ఆటిట్యూడ్ మార్చుకుంటారో..?