ఎన్టీఆర్ విషయంలోనూ అదే జరిగిందా..?

Jr NTRs Jai Lava Kusa Overseas Deal Closed
తెలుగు సినిమా ఎల్లలు దాటింది.  బాలీవుడ్ లో తెలుగు సినిమాలు రిలీజ్ అయినా కాకున్నా.. అమెరికాలో మాత్రం ఖచ్చితంగా విడుదలౌతున్నాయి.  అక్కడ కూడా బాక్సాఫీస్ విజయాలను సొంతం చేసుకుంటూ.. మంచి వసూళ్లు రాబట్టుకుంటున్నాయి.  సినిమా బాగుంది అంటే అది చిన్నదా లేదా పెద్దదా అన్నది పట్టించుకోరు.  యుఎస్ మార్కెట్ లో మిలియన్ డాలర్లు కలెక్ట్ చేస్తుంది.  నాని వంటి హీరోల సినిమాలు కూడా అక్కడ మంచి వసూళ్లు అందుకుంటున్నాయి.  ఇక బాహుబలి 2 తరువాత మార్కెట్ మరింత విస్తృతమైంది.  ఎక్కువ మొత్తం ఇచ్చి ఓవర్సీస్ రైట్స్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. దీనిని అవకాశంగా తీసుకొని మన నిర్మాతలు అమాంతం రేటు పెంచేస్తున్నారట.

సినిమా హిట్ అయితే సరే.. అదే సినిమా ఫట్ అయితే పరిస్థితి ఏంటి.  ఎంత ఓవర్సీస్ అయినా.. లాస్ వస్తే ఎం చేస్తారు.  సినిమా కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొనేందుకు సిద్దమయ్యారు.  స్పైడర్ విషయంలో అదే జరిగింది.  స్పైడర్ నిర్మాతలు 21 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే.. చివరకు 15 వరకు తీసుకునేందుకు ఓవర్సీస్ బయ్యర్లు ముందుకు వచ్చారు.  అదే విధంగా ఇప్పుడు జై లవకుశ విషయంలో కూడా అదే జరిగింది.  జైలవకుశ 18 కోట్లు డిమాండ్ చేశారు.  కానీ, ఓ కొత్త డిస్ట్రిబ్యూటర్లు 10.5 కోట్లకు సినిమాను తీసుకున్నారట.  ఇంత తక్కువకు తీసుకున్నా కనీసం ఓవర్సీస్ లో 2.2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తేకాని పంపిణీదారులు లాభాలు రావు.  నాని వంటి చిన్న హీరో సినిమా అక్కడ మిలియన్ డాలర్లు వసూలు చేస్తోంది.  ఖైదీ నెంబర్ 150 కూడా అక్కడ మంచి వసూళ్లే రాబట్టింది.  ఇప్పుడు ఫిదా కూడా ఆ దిశగానే పరుగులు తీస్తోంది.  ఇదే ఊపును జై కూడా కొనసాగిస్తేనే పంపిణీదారులకు లాభాలు వస్తాయి.  లేదంటే అంతే సంగతులు.