`మ‌హానాయ‌కుడు`లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో భాగంగా త్వ‌ర‌లోనే విడుద‌ల‌వుతున్న `ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు`లో జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించ‌బోతున్నారు. తాత ఎన్టీఆర్‌తో క‌లిసి ముచ్చ‌ట్లు చెప్ప‌బోతున్నారు. ఆ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌బోతున్నాయ‌ని చిత్ర‌వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ స‌న్నివేశాల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించ‌లేదు. ఆయ‌న పాత్ర‌లో నారా దేవాన్ష్ న‌టించాడు. సినిమాలో చిన్న‌ప్ప‌టి జూనియ‌ర్ ఎన్టీఆర్ పాత్రే ఉంటుంద‌ట‌. చిన్న‌ప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి త‌న తాత ముందుకు వెళ్ల‌గానే `అచ్చం మాలాగే ఉన్నాడు, నా పేరే పెట్టండి` అంటూ నంద‌మూరి తారక రామారావుగా నామ‌క‌ర‌ణం చేశార‌ట ఎన్టీఆర్‌. అప్ప‌ట్నుంచి తార‌క్ కాస్త నంద‌మూరి తార‌క రామారావు అయ్యారు. అభిమానులు జూనియ‌ర్ ఎన్టీఆర్ అని పిలుచుకొంటున్నారు. ఆ స‌న్నివేశాల్నే `ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు`లో చూపించ‌బోతున్నార‌ట‌. అవ‌న్నీ అభిమానుల్ని అల‌రించ‌బోతున్నాయ‌ట‌. `ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు` విడుద‌ల తేదీ ఖ‌రారు కావ‌డంతో, ప్ర‌మోష‌న్ ఊపందుకోనుంది. త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ‌, రానా నేప‌థ్యంలో సాగే కొన్ని టీజ‌ర్లు విడుద‌ల కాబోతున్నాయి. రానా చిత్రంలో చంద్ర‌బాబు పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే.