వ‌ర్మ వెనక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

ఏపీలో మే 1న `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజ్ నేప‌థ్యంలో సినిమా ప్ర‌మోష‌న్ కు కొన్ని అదృష్య శ‌క్తులు అడ్డుపుడుతున్నాయ‌ని ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. చివ‌రికి బెజ‌వాడ‌ న‌డిరోడ్డు మీద‌ ప్రెస్ మీట్ పెడ‌తా? ఎవ‌రు అడ్డొస్తారో? చూస్తానంటూ స‌వాల్ విసిరి ర‌ణ‌రంగానికి దిగాడు వ‌ర్మ‌. దీంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి వ‌ర్మ‌ను అరెస్ట్ చేసారు. కొన్ని గంట‌ల పాటు సాగిన ఈ ఢ్రామా ప్ర‌జ‌ల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందంటూ ఆరోప‌ణ‌లు గుప్పించారు. తాజాగా వ‌ర్మ‌కు అండ‌గా వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిల‌బ‌డ్డారు.

విజ‌య‌వాడ‌లో ప్రెస్ మీట్ పెట్ట‌లేని ప‌రిస్థితుల్లో మ‌న ప్ర‌జాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతులు క‌న్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మ‌న ప్ర‌జాస్వామ్యం ఉంది. ఇదా ప్ర‌జాస్వామ్యం చంద్ర‌బాబు గారు అంటూ ధ్వ‌జ‌మెత్తాడు. ఇంత‌కీ రాంగోపాల్ వ‌ర్మ చేసిన త‌ప్పేంటి? అని ప్ర‌శ్నించాడు. వాస్త‌వానికి వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ జ‌గ‌న్ హ‌స్తం ఉంద‌నే ఆరోప‌ణ‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ స‌మ‌యంలో వ‌ర్మ చాలా స‌మ‌స్య‌లు ఫేస్ చేసాడు. కానీ అప్ప‌టికి ఎలక్షన్స్ జ‌ర‌గ‌లేదు. ఈ నేప‌త్యంలో జ‌గ‌న్ సినిమా గానీ, వ‌ర్మ‌ను గానీ ఉద్దేశించి ఎలాంటి ట్వీట్ చేయ‌లేదు. తాజాగా ఎన్నిక‌లు పూర్త‌వ్వ‌డం..వైకాపా అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తోన్న నేప‌థ్యంలో వ‌ర్మ త‌రుపున జ‌గ‌న్ వ‌కాల్తా పుచ్చుకోవ‌డం అంత‌టా చ‌ర్చ‌కొస్తుంది. ఈ చిత్రాన్ని రాకేష్ రెడ్డి నిర్మించిన సంగ‌తి తెలిసిందే.