30న నిర్మాత‌ల మండ‌లి ఎన్నికలు

ఈనెల 30న టాలీవుడ్ నిర్మాత‌ల మండ‌లి(టీఎఫ్‌పీసీ) ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ మేర‌కు మండ‌లి నుంచి అధికారిక స‌మాచారం రివీలైంది. జూన్ 12 నుంచి 15 వ తేదీ వరకు నామినేష‌న్లు స్వీక‌రిస్తారు. రెండు ఆపై ఎక్కువ పోస్టులకు నామినేషన్ వేసినవారు‌ 18వ తేదీ లోపల ఏదో ఒక పోస్ట్ వుంచుకోవాలి మిగిలినవి ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఒకటే పోస్ట్ నామినేషన్ వేసినవారు 22వ తేదీ లోపల ఉపసంహరించుకోవాలి. 22 వ తేదీ సాయంత్రం పోటీలో వున్న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. వాస్త‌వానికి ఈ పాటికే నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్నా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూనే ఉంది. ఎట్ట‌కేల‌కు తేదీని ప్ర‌క‌టించారు. 30వ తేదీ కొత్త బాడీ ఎన్నిక కానుంది.

ఎన్నికల పోలింగ్ సమయం:
30-06-2019వ తేదీ ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు
ఎన్నికల ఫలితాలు:
మధ్యాహ్నం 3.00 గంటల తర్వాత​ నుండి లెక్కించ‌నున్నారు. సాయంత్రం 10 గం.ల లోపు ఫ‌లితం వెలువ‌డుతుంది.