పాపం: ఇది హాలీవుడ్ దండయాత్ర..!

అవును.. ఇప్పుడు ఇదే అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లంతా. ఇన్నాళ్ళూ హాలీవుడ్ సినిమాలు వ‌స్తున్నాయి అంటే.. ఆ ఏముందిలే సిటీల్లో కొంద‌రు మాత్ర‌మే చూస్తారు.. వాటికి లిమిటెడ్ ఆడియ‌న్స్ ఉంటారు.. ఎంత బాగున్నా కూడా మ‌న సినిమాల‌ను ప‌డ‌గొట్టేంత సినిమా మాత్రం హాలీవుడ్ సినిమాల‌కు లేదులే అని లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు టైమ్ మారుతుంది. అంతా హాలీవుడ్ సినిమాలు చూడ్డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. మ‌న సినిమాల్లో లేనిది అక్క‌డ క‌నిపిస్తుంటే కోట్ల‌కు కోట్లు క‌ట్ట‌బెడుతున్నారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. అవేంజ‌ర్స్ దెబ్బ‌కు మ‌న ద‌గ్గ‌ర భ‌ర‌త్ అనే నేను.. నా పేరు సూర్య తోక‌ముడిచాయి. ఇక బాలీవుడ్ లో అయితే చాలా సినిమాలు ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయాయి. త‌మిళ‌నాట కూడా ప‌రిస్థితి ఇంతే. ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 10 రోజుల్లో కేవ‌లం ఇండియాలోనే 250 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసిందంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఇదే దూకుడు కొన‌సాగితే ఇండియాలో తొలి 300 కోట్ల సినిమాగా అవేంజ‌ర్స్ చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం.jurassic park fallen kingdom Releasing June 8th Two Weeks Before in Indiaగ‌త కొన్నేళ్లుగా జురాసిక్ వ‌రల్డ్.. జంగిల్ బుక్.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ 7.. అవ‌తార్.. 2012.. లాంటి సినిమాలు ఇండియ‌న్ బాక్సాఫీస్ ను కుమ్మేసాయి. ఇప్పుడు ఇది ఇంకా ఎక్కువైపోయింది. జూన్ 8న‌ జురాసిక్ వ‌ర‌ల్డ్ ఫాలెన్ కింగ్ డ‌మ్ భారీగా విడుదలవుతుంది. భారీగా అంటే ఏకంగా 2200 థియేట‌ర్స్ లో వ‌స్తున్నాయి ఈ రెండు సినిమాలు. అంటే ఇక్కడ ఓ స్టార్ హీరో వ‌చ్చినంత భారీగా అన్న‌మాట‌. వీటివ‌ల్ల మ‌ల్టీప్లెక్స్ క‌లెక్ష‌న్స్ అన్నీ మ‌న సినిమాల‌కి దెబ్బ ప‌డుతున్నాయి. అవేంజ‌ర్స్ వ‌చ్చి ప‌ది రోజులు అవుతున్నా.. ఇప్ప‌టికీ మ‌ల్టీప్లెక్స్ లలో టికెట్ల కోసం యుద్ధాలు జ‌రుగుతున్నాయంటే ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. హాలీవుడ్ సినిమాల‌కు ఇంత‌గా ఆద‌ర‌ణ ఉంది కాబ‌ట్టే అక్క‌డి కంటే రెండు వారాల ముందే ఇండియాలో విడుద‌ల చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.