ఇండియాని గ‌జ‌గ‌జ ఒణికించే మూవీ

Last Updated on by

ప్ర‌పంచ దేశాల‌తో పాటు ఇండియాని గ‌జ‌గ‌జ ఒణికించే సినిమా ఒక‌టి రాబోతోంది. ముఖ్యంగా అవెంజ‌ర్స్‌-ఇన్‌ఫినిటీ వార్ రికార్డుల్ని తుత్తునియ‌లు చేయ‌బోతున్న మ‌రో అదిరిపోయే సినిమా రాబోతోంది. స్టార్ వార్స్‌, బ్లాక్ పాంథ‌ర్‌, అవ‌తార్.. ఇంకే రికార్డు నిల‌బ‌డ‌డం క‌ష్టం. ఫిక్ష‌న్ స్పెష‌లిస్ట్‌.. హార‌ర్ థ్రిల్ల‌ర్ స్పెష‌లిస్ట్ స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ నుంచి వ‌స్తున్న మిరాకిల్ ఇద‌ని చెప్పొచ్చు. జె.ఏ బ‌యోనా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి క్రిస్టోఫ‌ర్ నోలాన్ క్రియేటివ్ మేధోత‌నం అడిష‌న‌ల్ అడ్వాంటేజ్‌.

ఇప్ప‌టికే `జురాసిక్ వ‌ర‌ల్డ్ -ఫాలెన్ కింగ్ డ‌మ్‌` పోస్ట‌ర్లు, ట్రైల‌ర్లు వెబ్ ప్ర‌పంచంలో హోరెత్తిస్తున్నాయి. డైనోసార్ వెంబడిస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ రిలీజ్ చేసిన టీజ‌ర్లు క‌ట్టి ప‌డేశాయి. థియేట్రిక‌ల్‌ ట్రైల‌ర్ న‌భూతోన‌భ‌విష్య‌తి అన్న తీరుగా ఆక‌ట్టుకుంది. ముందే ప్ర‌క‌టించిన‌ట్టే ఈ జూన్ 8న‌ వేస‌వి కానుక‌గా పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రి ముందుకు వ‌చ్చేస్తోంది ఈ చిత్రం. ఇక ఈ సినిమా ఇండియాలో అమెరికా కంటే రెండు వారాల ముందే రిలీజ‌వుతోంది. `ఫాలెన్ కింగ్‌డ‌మ్‌` చిత్రాన్ని 2300 పైగా స్క్రీన్ల‌లో ఇంగ్లీష్‌, హిందీ, త‌మిళ్‌, తెలుగు వెర్ష‌న్ల‌ను రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలో ఇదివ‌ర‌కూ అవెంజ‌ర్స్‌-2 దాదాపు 150 కోట్లు వ‌సూలు చేసింది. ఇప్ప‌టికీ విజ‌య‌వంతంగా ఆడుతోంది. ఈ సినిమా రికార్డుల్ని జురాసిక్‌పార్క్ 2 బ్రేక్ చేస్తుంద‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. 2018 మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ మూవీగా ఈ చిత్రం ట్రెండింగ్ అవుతోంది.

User Comments