వ‌న్ డే ముందే డైనోసార్ ఎటాక్‌

Last Updated on by

ఈ స‌మ్మ‌ర్‌లో `అవెంజ‌ర్స్ -ఇన్‌ఫినిటీ వార్‌`, `డెడ్‌పూల్ 2` చిత్రాలు ఇండియా బాక్సాఫీస్‌ని కొల్ల‌గొట్టాయి. ఇవ‌న్నీ దాదాపు 300కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించాయి. ఇప్ప‌టికీ మెట్రో న‌గ‌రాల మ‌ల్టీప్లెక్సుల్లో టిక్కెట్లు దొర‌క‌ని ప‌రిస్థితి ఉందంటే న‌మ్మ‌గ‌ల‌రా? హాలీవుడ్ సినిమాల‌కు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇప్పుడు వీట‌న్నిటినీ కొట్టేసే వేరొక సినిమా వ‌స్తోంది. అదే జురాసిక్ వ‌ర‌ల్డ్ – ఫాలెన్ కింగ్‌డ‌మ్‌. ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్లు, పోస్ట‌ర్లు పిల్ల‌లు స‌హా పెద్ద‌ల్లోనూ క్యూరియాసిటీ పెంచాయి. ఈ స‌మ్మ‌ర్ ముగింపులో ఈ సినిమా వ‌సూళ్ల ధ‌మాకా మోగిస్తుంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి.

అందుకు త‌గ్గ‌ట్టే ఎప్ప‌టిక‌ప్పుడు జారిసిక్ వ‌ర‌ల్డ్ ప‌బ్లిసిటీ టీమ్ .. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త టీజ‌ర్ల‌ను రిలీజ్ చేస్తూ అంత‌కంత‌కు వేడి పెంచేస్తోంది. తాజా తాజా బ్రేకింగ్ న్యూస్ ఏమంటే.. జురాసిక్ వ‌ర‌ల్డ్ 2 చిత్రం ఇండియాలో ఒక‌రోజు ముందే .. అంటే జూన్ 7న రిలీజైపోతోంది. ఆ త‌ర‌వాతే ఇత‌ర దేశాల్లో రిలీజ్ కానుంది. ఇండియాలో ఇంగ్లీష్‌, హిందీ, త‌మిళ్‌, తెలుగు భాష‌ల్లో ఈ చిత్రం అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతోంది. ఈ ఏడాదితో జురాసిక్ పార్క్ ఫ్రాంఛైజీ మొద‌లై దిగ్విజ‌యంగా 25 వ‌సంతాలు పూర్తి చేసుకుంది. ఆ మేర‌కు క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ వివ‌రాలందించారు. మ‌న దేశంలో ఒక రోజు ముందే రిలీజ‌వుతున్న జురాసిక్ వ‌ర‌ల్డ్ 2… బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం, రికార్డులు అందుకోవ‌డం గ్యారెంటీ.

User Comments