జురాసిక్ వ‌ర‌ల్డ్2 కొత్త టీజ‌ర్‌

Last Updated on by

ఈ ప్ర‌పంచం భ‌యం గుప్పిట్లో విల‌విల‌లాడే రోజు రానే వ‌చ్చేస్తోంది. హార‌ర్‌.. టెర్ర‌ర్‌… ప్ర‌పంచ‌దేశాల్ని ఒణికించే రోజు అది. ఆ రోజు జూన్ 22. లెజెండ్ .. డైనోసార్ సినిమాల‌ సృష్టిక‌ర్త స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ సృజ‌నాత్మ‌క‌త అందించి, నిర్మించిన `జురాసిక్ వ‌ర‌ల్డ్ – ఫాలెన్ కింగ్‌డ‌మ్‌` ఆ రోజు రిలీజ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్లు, ట్రైల‌ర్లు ఆక‌ట్టుకున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త పోస్ట‌ర్లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లోనూ వేగం పెరిగింది. తాజాగా మ‌రో కొత్త టీజ‌ర్‌ని యూనిట్ లాంచ్ చేసింది.

ఫాలెన్ కింగ్‌డ‌మ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ మోడ్‌లో ఉంటుంద‌ని ఈ కొత్త టీజ‌ర్ చెప్ప‌క‌నే చెప్పింది. ట్రైల‌ర్ ఆద్యంతం భ‌యం అనే పాయింట్ ఉత్కంఠ రేపుతోంది. అలానే సైంటిస్టులు ల్యాబుల్లో చేసే ప్ర‌యోగాలు.. ఆ ప్ర‌యోగాల్లో డైనోసార్ పిల్ల‌ల ఆవిర్భావం.. అవి మ‌నుషుల‌కు స్నేహితులుగా మారి.. అనుకూలంగా ప్ర‌వ‌ర్తించ‌డం వంటి ర‌క‌రకాల విన్యాసాల్ని తెర‌పై చూడ‌బోతున్నామ‌ని ఈ కొత్త టీజ‌ర్ చెబుతోంది. మునుప‌టి టీజ‌ర్ల‌తో పోలిస్తే మ‌రింత గ్రిప్పింగ్‌గా ఉందీ టీజ‌ర్‌. హార‌ర్ .. టెర్ర‌ర్ ని ఫేస్ చేసేందుకు మీరు సిద్ధ‌మా? అయితే గుర్తు పెట్టుకోండి జూన్ 22!! డెడ్లీ హ‌ర‌ర్ టెర్ర‌ర్‌ డే..

User Comments