జ్యోతిక‌- మంచు ల‌క్ష్మి మ‌ల్టీస్టార‌ర్‌?

Last Updated on by

రీసెంట్‌గానే `వైఫ్ ఆఫ్ రామ్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ల‌క్ష్మీ మంచు. భ‌ర్త‌ను వెతుక్కునే భార్య పాత్ర‌లో ల‌క్ష్మీ న‌ట‌న బావుందంటూ ప్ర‌శంస‌లొచ్చాయి. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద సినిమా మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ల‌క్ష్మీ ఎంతో శ్ర‌మించినా ఆ ఫ‌లితం మాత్రం నిరాశ‌నే మిగిల్చింది. అదంతా అటుంచితే చేదు జ్ఞాప‌కాల ను దూరం పెట్టి తీపి జ్ఞాప‌కాల‌ను వెతుక్కోవ‌డానికి అల‌వాటు ప‌డిన మంచు వార‌మ్మాయ్‌.. ప్ర‌స్తుతం సౌత్‌లో ఓ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తోంది. అది కూడా జ్యోతిక లాంటి ప్ర‌తిభావ‌నితో క‌లిసి స్క్రీన్‌ని షేర్ చేసుకుంటోంది. ఇంత‌కీ ఏ సినిమాలో అంటే..?

ఇటీవ‌లే విద్యాబాల‌న్ క‌థానాయిక‌గా న‌టించిన `తుమ్హారీ షులూ` త‌మిళ రీమేక్‌లో ల‌క్ష్మీ మంచు ఓ ఆస‌క్తిక‌ర పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ చిత్రంలో బాల‌న్ పాత్ర‌లో జ్యోతిక న‌టిస్తోంది. ఇక బాల‌న్ ప‌ని చేసే ఆఫీస్‌లో బాస్ పాత్ర‌లో ల‌క్ష్మీ న‌టించ‌నుందిట‌. ఇక ల‌క్ష్మీ బాస్ త‌న ఎంప్లాయ్ జ్యోతిక‌తో క‌లిసి స్టెప్పులేసే ఓ పాట‌ను ఈ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నారు. మ‌ల‌యాల హిట్ సాంగ్ `జిమ్మిక్కి క‌మాల్‌` ని రీమిక్స్ చేశార‌ట‌. ఇది మోహ‌న్‌లాల్ న‌టించిన‌ వేలిప‌డింటే పుస్త‌కం అనే చిత్రంలోనిది. ఇక‌పోతే `తుమ్హారీ షులూ` చిత్రంలో శ్రీ‌దేవి ఐకానిక్ సాంగ్ `హ‌వా హ‌వాయీ`ని రీమిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. బాల‌న్ ఆ పాట‌లో అద్భుతంగా అభిన‌యించింది. ప్ర‌స్తుతం జ్యోతిక‌- మంచు ల‌క్ష్మీ కాంబో మ‌ల్టీస్టార‌ర్‌పై తెలుగు ఫిలింన‌గ‌ర్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

User Comments