`2.0` బ‌య్య‌ర్ల‌పై `కాలా` ఎఫెక్ట్‌?

Last Updated on by

చెట్టు పేరు చెప్పి కాయ‌ల‌మ్మేయ‌డంలో మ‌నోళ్లు ఘ‌నాపాటీలే. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మార్కెట్, బాక్సాఫీస్ రిజ‌ల్ట్ గ‌త కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా ప‌డిపోయినా, 2.ఓ చిత్రాన్ని ఏరియా వైజ్‌ భారీ మొత్తాల‌కు అమ్మేయ‌డం చూస్తుంటే, మ‌న ట్రేడ్ లో సాగుతున్న ఆట ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించ‌క మాన‌దు. క‌బాలి, కాలా చిత్రాల‌కు అస‌లు ర‌జ‌నీ రేంజు జీరోకి ప‌డిపోయింది. కాలా బిజినెస్ 7కోట్ల లోపేన‌ని ట్రేడ్ లో చ‌ర్చ సాగింది. కానీ ఇప్పుడు 2.ఓ చిత్రాన్ని మాత్రం ఏకంగా 100కోట్ల‌కు పైగా ప్రీరిలీజ్‌ బిజినెస్ సాగిస్తున్నార‌ని తెలుస్తోంది.

ఈ సినిమాని ఎన్ వి ప్ర‌సాద్- దిల్‌రాజు- యువి క్రియేషన్స్ వంశీ సంయుక్తంగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. నైజాం- వైజాగ్ ఏరియాల‌కు దిల్‌రాజు రిలీజ్ చేస్తుంటే, గోదావ‌రి జిల్లాలు- సీడెడ్‌లో ఎన్‌.వి.ప్ర‌సాద్ రిలీజ్ చేస్తున్నారు. గుంటూరు- నెల్లూరు ఏరియాని వంశీ హ‌స్త‌గ‌తం చేసుకుని రిలీజ్ చేస్తున్నార‌ట‌. ఆయా ప్రాంతాల్లో 2.ఓ పంపిణీ హ‌క్కుల్ని భారీ మొత్తాల‌కు సేల్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. కేవ‌లం ఒక్క తూర్పు గోదావ‌రికి రూ.5.5 కోట్ల మేర 2.ఓ హ‌క్కులకు డిమాండ్ చేస్తున్నారంటే సీన్ ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. వాస్త‌వానికి ర‌జ‌నీ గ‌త చిత్రం కాలా ఇక్క‌డ సుమారు 50ల‌క్ష‌ల మేర షేర్ మాత్ర‌మే వ‌సూలు చేసింది. దాంతో భారీ మొత్తాల‌కు కొనుక్కున్న‌ బ‌య్య‌ర్ల‌కు న‌ష్టం త‌ప్ప‌లేదు. ఇప్పుడు 2.ఓ బిజినెస్ పీక్స్‌లో ఉందిక్క‌డ‌. 2.ఓ చిత్రాన్ని ఏషియ‌న్ సునీల్ నారంగ్ నుంచి ఎన్వీ ప్ర‌సాద్ బృందం ఛేజిక్కించుకున్నారు. అటుపై అస‌లు ఆట మొద‌లైంది. ఈ త్ర‌యం 72కోట్ల‌కు హ‌క్కులు కొనుక్కున్నారు. జీఎస్టీ వ‌గైరా క‌లుపుకుంటే రూ.80కోట్లు వీళ్ల పెట్టుబ‌డి. దీనిపై మినిమంగా 100కోట్లు క‌లెక్ట్ చేయాల‌న్న గేమ్ న‌డుస్తోందిట‌. ర‌జ‌నీ స‌న్నివేశం ఏం బాగోకున్నా రోబో స‌క్సెస్ నేప‌థ్యం, అలానే శంక‌ర్‌పై కాన్ఫిడెన్స్ ఈ రేంజును పెంచాయి. ఇటీవ‌లే రిలీజైన ట్రైల‌ర్ అంచ‌నాల్ని పెంచ‌డంతో ఈ స్థాయిలో బిజినెస్ సాగుతోంద‌ని తెలుస్తోంది. అయితే భారీ మొత్తాల‌కు కోట్ చేస్తుంటే కాలా ప్ర‌భావంతో బ‌య్య‌ర్ల‌లో కాస్తంత సందిగ్ధ‌త‌లు నెల‌కొన్నాయ‌ని చెప్పుకుంటున్నారు.

User Comments