కాలా` మ‌రో `లింగ‌

Last Updated on by

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `కాలా` ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌మిళ‌నాడు, మ‌లేషియాలో వీకెండ్ వ‌సూళ్లు ఫ‌ర్వాలేద‌నిపించింది. అయితే తెలుగు, హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం బోల్తా కొట్టింద‌నేది ట్రేడ్ లెక్క‌లు చెబుతున్నాయి. తొలి మూడు రోజులు ఆశించిన వ‌సూళ్లు ద‌క్క‌క‌పోగా, సోమ‌వారం నాటికి వ‌సూళ్ల ప‌రంగా `కాలా` పూర్తిగా వెన‌క‌బ‌డింద‌ని తెలుస్తోంది.

తాజాగా తెలుగు రాష్ట్రాల షేర్ లెక్క‌లు రూ.7కోట్ల లోపు అని ట్రేడ్ ప్ర‌క‌టించింది. ఇక్క‌డ ఏకంగా 33కోట్ల మేర థియేట్రిక‌ల్ రిలీజ్ బిజినెస్ చేసిన కాలా ఇంకా 25కోట్లు పైగా షేర్ వ‌సూలు చేయాల్సి ఉంది. అంటే ఆ మేర‌కు సినిమా డిజాస్ట‌ర్ రిజల్ట్ ఖాయ‌మైన‌ట్టే. హిందీలోనూ సేమ్ రిజ‌ల్ట్ రిపీటైంది. తెలుగు రాష్ట్రాలు మిన‌హా ఇత‌ర భార‌త‌దేశంలో కాలా చిత్రం 6కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింద‌ని తెలుస్తోంది. ఈ ఫ‌లితం ఊహించ‌నిది. ర‌జ‌నీ మానియా అస‌లేమైందో అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ అభిమానుల్లో సాగుతోంది.

User Comments