కైరా అద్వాని ఇక‌పై తెలుగ‌మ్మాయే..!

Last Updated on by

ఒక్కోసారి బాలీవుడ్ లో జాత‌కం కుద‌ర‌దు. అందం ఉన్నా అక్క‌డ అవ‌కాశాలు రావు. అలాంటి ముద్దుగుమ్మ‌ల‌కు టాలీవుడ్ ఎప్పుడూ స్వాగ‌తం ప‌లుకుతూనే ఉంటుంది. ఇప్ప‌టికే ర‌కుల్.. దిశాప‌టానీ.. పూజాహెగ్డే లాంటి హీరోయిన్లంతా బాలీవుడ్ లో స‌క్సెస్ కానందుకే తెలుగుకు వ‌చ్చారు. ఇక్క‌డ వాళ్ల‌కు బాగానే క్రేజ్ ఉంది. ర‌కుల్ అయితే నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఇదే దారిలో మ‌రో భామ కూడా వ‌చ్చింది. ఆ భామ పేరు కైరాఅద్వానీ. మ‌హేశ్ భ‌ర‌త్ అనే నేనుతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతుంది ఈ ధోనీ భామ‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ హీరోగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. మ‌హేశ్, హీరోయిన్ కైరాఅద్వానిపై సీన్స్ చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు. కైరా ఈ చిత్రంలో గ్లామ‌ర‌స్ రోల్ లో క‌నిపిస్తుంది. లొకేష‌న్ లో అమ్మాయిగారు సంద‌డి చేస్తోన్న ఫోటోలు కొన్ని బ‌య‌టికి వ‌చ్చాయి. ఇందులో బ్యూటీ ఫుల్ గ్లామ‌ర్ అవ‌తారంలో క‌నిపిస్తుంది.

ఇక మ‌హేశ్ సినిమా సెట్స్ పై ఉండ‌గానే రామ్ చ‌ర‌ణ్-బోయ‌పాటి సినిమాలోనూ ఈమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ రెండు సినిమాలు భారీవే.. ఒకేసారి ఇద్ద‌రు టాప్ హీరోల‌తో న‌టించే అవ‌కాశం అందుకుంది కైరా. ఈ దెబ్బ‌తో పాప స్టార్ హీరోయిన్ అయిపోవ‌డం ఖాయం. రెండూ హిట్టైతే నెంబ‌ర్ గేమ్ లో ముందుకు కూడా వ‌చ్చేస్తుంది. అన్న‌ట్లు మ‌హేశ్ తో బాలీవుడ్ భామ‌లు జోడీ క‌ట్ట‌డం ఇదే తొలిసారి కాదు. సోనాలి బింద్రే.. బిపాషా బ‌సు.. అమీషా ప‌టేల్.. ప్రీతిజింటా లాంటి బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ల త‌ర్వాత కైరాతో జోడీ క‌డుతున్నాడు సూప‌ర్ స్టార్. చ‌ర‌ణ్ కూడా ఇప్పుడిప్పుడే బాలీవుడ్ భామ‌ల వైపు మ‌న‌సు పెడుతున్నాడు. ప్రియాంక చోప్రాతో ఇదివ‌ర‌కే రొమాన్స్ చేసాడు ఈ మెగా హీరో.

User Comments