మహేష్, పవన్, ఎన్టీఆర్, ప్రభాస్ లపై సెటైర్లా..?

 

సౌత్ స్టార్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న కాజల్ అగర్వాల్ రీసెంట్ గా 50 సినిమా ఫీట్ ను కూడా సాధించేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్టార్ హీరోలు అందరితోనూ జతకట్టిన కాజల్.. అందరితోనూ మంచి జోడీగా కితాబులందుకుంది. అయితే, ఉన్నట్టుండి కాజల్ తాజాగా ఓ టెలివిజన్ షో లో పాల్గొని తనతో నటించిన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి బడా స్టార్స్ పై కొన్ని సెటైర్స్ తో కూడిన కామెంట్స్ చేసిందని తెలియడం హాట్ టాపిక్ అయింది. ప్రధానంగా సదరు స్టార్ హీరోల స్వభావాల గురించి మాట్లాడిన కాజల్.. వాళ్ళు ఇంకా ఏ తరహా అలవాట్లను అలవర్చుకుంటే బాగుంటుందనే ప్రశ్నకు సరదాగానే సమాధానాలు చెప్పినా ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా మహేష్ స్వభావం గురించి కాజల్ మాట్లాడుతూ.. మహేష్ ఓ చాటర్ బాక్స్ అని, అతను ఒక్కోసారి మాట్లాడటం ఆపేయాలి అని సలహా ఇవ్వడం ఫ్యాన్స్ కు నచ్చడం లేదట. అలాగే పవన్ గురించి కాజల్ మాట్లాడుతూ.. పవన్ కొన్ని సమయాల్లో మాట్లాడటం నేర్చుకోవాలి అని వ్యాఖ్యానించడం, ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. హైపర్ యాక్టివిటీని పెంచుకోవాలి అని సూచించడం, చివరగా ప్రభాస్ ను ప్రస్తావిస్తూ.. తనకు ఎనర్జీ కావాలి అని కాజల్ చెప్పడం ఇప్పుడు ఫ్యాన్స్ ను హర్ట్ అయ్యేలా చేసిందని అంటున్నారు. మొత్తంగా ఒక్కో స్టార్ హీరోపై ఒక్కోలా కాజల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు షాక్ కు గురి చేయడమే కాకుండా.. సదరు స్టార్ హీరోల అభిమానులను బాధించాయని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కాజల్ వ్యాఖ్యలు వైరల్ గా మారడమే కాకుండా దీనిపై చిన్నపాటి చర్చే జరుగుతుందని చెప్పుకుంటున్నారు. మరి ఈ తరహా కామెంట్లు కాజల్ కు ఏమైనా ఇబ్బందులు కలిగిస్తాయేమో చూడాలి.