కాద‌న్నవారే భ‌లే క‌లిసారే..!

ఎవ‌రా కాద‌న్న‌వారు అనుకుంటున్నారా..? ఇంకెవ‌రు ఎమ్మెల్యే ప్రీ రిలీజ్ లో క‌నిపించారుగా.. శీనువైట్ల అండ్ కాజ‌ల్. వీళ్లిద్ద‌రూ ఎప్పుడు ఎక్క‌డ ఏ విష‌యంలో కాద‌న్నార‌నేగా మీ అనుమానం. ఈ మ‌ధ్యే శీనువైట్ల కొత్త సినిమా మొద‌లైంది క‌దా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ అని ర‌వితేజ‌తో. అందులో హీరోయిన్ గా ముందు కాజ‌ల్ నే అనుకున్నాడు వైట్ల‌. మైత్రి మూవీ మేక‌ర్స్ కూడా ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్ గా న‌టించే అవ‌కాశం ఉంద‌ని ఓ క్లారిటీ అయితే ఇచ్చింది. పైగా ర‌వితేజ హీరో కావ‌డంతో కాజ‌ల్ కూడా కాద‌న‌డానికి మ‌రో అవ‌కాశ‌మే లేదు. కానీ కాదంది ఈ చంద‌మామ‌. ఆమె స్థానంలోకి అను ఎమ్మాన్యువ‌ల్ వ‌చ్చింది. దానికి కార‌ణం పారితోషికం.

కాజ‌ల్ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మాత్రం త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే అంటది. అందుకే అప్ప‌టికే ర‌వితేజ‌తో సారొచ్చారు.. వీర చేసి ఉన్నా.. శీనువైట్ల‌తో బాద్షా చేసిన అనుభ‌వం ఉన్నా అడిగినంతా ఇవ్వ‌లేద‌ని ఈ సినిమా వ‌దిలేసింది కాజ‌ల్. మ‌ళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే ప్రీ రిలీజ్ వేడుక‌లో శీనువైట్ల ప‌క్కనే కూర్చుని ఏమీ జ‌ర‌గ‌న‌ట్లు తెగ మాట్లాడేసింది. అయినా ఇండ‌స్ట్రీలో ఇవ‌న్నీ కామ‌న్ లెండీ..! ఇంత‌కీ ఎమ్మెల్యే ఫంక్ష‌న్ కు శీనువైట్ల ఎందుకొచ్చాడో తెలుసా.. ఈయ‌న ద‌గ్గ‌ర ఉపేంద్ర మాధ‌వ్ ప‌నిచేసాడు. ఆగ‌డు సినిమా క‌థ రాసింది కూడా ఈయ‌నే.. అనిల్ రావిపూడితో క‌లిసి. అద‌న్న‌మాట సంగ‌తి ఆయ్..!