సీత‌ పాత్ర కోసం కొంద‌రిని చ‌దివాను!-కాజ‌ల్

Last Updated on by

కాజ‌ల్ అగ‌ర్వాల్ – బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ జంట‌గా తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సీత ఈనెల 24న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన మ‌రునాడే ఈ సినిమా రిలీజ‌వుతుండ‌డం మ‌రో ఆస‌క్తిక‌ర ఎలిమెంట్. రిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్ పాత్రికేయుల‌తో తాజాగా కాజ‌ల్ ముచ్చ‌టించారు. సీత అంటే గీత గీసే అమ్మాయి కాదు.. త‌న ల‌క్ష్యం కోసం.. అనుకున్న‌ది సాధించుకోవ‌డం కోసం స్వార్థం చూపించే అమ్మాయి మాత్ర‌మే. ఒక‌వేళ గీత గీసే.. ఎదుటివారికి హ‌ద్దులు నిర్ణ‌యించే నెగెటివిటీ ఆ పాత్ర‌లో ఉండ‌ద‌ని కాజ‌ల్ స్ప‌ష్టంగా చెప్పారు. వ్య‌క్తిగ‌త జీవితంలో నేను నా ప‌ని వ‌ర‌కూ ప‌రిమితం. ఎదుటివారి విష‌యాల్లో అస్స‌లు వేలు పెట్ట‌న‌ని కాజ‌ల్ ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు.
త‌న పాత్ర గురించి మ‌రిన్ని సంగ‌తులు చెబుతూ .. సీత చిత్రానికి పౌరాణిక క‌థ‌ల‌(రామాయ‌ణం)కు సంబంధం లేదు. త‌న‌కంటూ కొన్ని క‌ల‌లు.. ల‌క్ష్యాలు ఉంటాయి. వాటికోసం ఎంత‌వ‌ర‌కూ అయినా శ్ర‌మించే త‌త్వం ఉన్న అమ్మాయిగా క‌నిపిస్తాను. సీత ప్ర‌యాణంలో హీరో క‌థేంటి?  ఇత‌ర పాత్ర‌లు ఎలా ప్ర‌వ‌ర్తించాయి? అన్న‌దే నా సినిమా అని తెలిపారు. వాస్త‌వానికి ఈ క‌థ‌ను చాలా కాలం క్రిత‌మే తేజ చెప్పారు. అయితే కాల్షీట్లు కుద‌ర‌కు చేయ‌లేదు. నేనే రాజు నేనే మంత్రి త‌ర్వాత మ‌రో బ‌లమైన పాత్ర‌లో న‌న్ను చూపించారు తేజ. ఈ క‌థ‌లో ఎప్ప‌టికైనా నేనే న‌టించాలి అని తేజ గారికి చెప్పానని తెలిపారు.
సీత పాత్ర కోసం చాలా పుస్త‌కాలు చ‌దివాను. ఎంద‌రినో చ‌దివాను. న‌టించేందుకు గొప్ప ఆస్కారం ఉన్న పాత్ర ఇది. ప‌రిధి దాట‌కుండా నెగెటివిటీ లేకుండా సీత పాత్ర‌ను బ్యాలెన్స్ చేసేందుకు చాలానే శ్ర‌మించాల్సి వ‌చ్చింది. ఫైట్స్ చేశాను. రిస్కీ ప‌నులెన్నో చేశాను. 200 కేజీల ఐస్ గ‌డ్డ‌ల్ని నాపై వేసుకుని న‌టించాల్సొచ్చింది. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలానే తంటాలు ఉన్నాయి అని తెలిపారు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ పాత్ర అంతే ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని కాజ‌ల్ కితాబివ్వ‌డం మ‌రో ఆస‌క్తిక‌ర పాయింట్.