కాజ‌ల్ కూడా తాగేస్తుందిగా..!

Last Updated on by

ఈ రోజుల్లో తాగ‌డం అనేది చాలా చిన్న విష‌యం. ఆడ‌మ‌గా అనే తేడా లేకుండా అంతా తాగేస్తున్నారు. ఇక ఇండ‌స్ట్రీలో అయితే సోష‌ల్ డ్రింకింగ్ కు మంచి క్రేజ్ ఉంది. అంటే అంద‌రితో పాటు పార్టీలో తాగ‌డం అన్న‌మాట‌. ఇప్పుడు కాజ‌ల్ కూడా తాగ‌డం అల‌వాటు చేసుకుంది. అయితే ఈమె తాగేది మాత్రం మందు కాదు. కూల్ డ్రింక్ తాగేస్తుంది. కాజ‌ల్ ప్ర‌స్తుతానికి కొన్ని బ్రాండ్స్ కు ప్ర‌చారం చేస్తుంది. ఇక ఇప్పుడు 7 అప్ కు అన్ అఫీషియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిపోయింది చంద‌మామ‌. అంటే ఎండోర్స్ మెంట్ చేయ‌ట్లేదు కానీ తాగండి అని మాత్రం చెబుతుంది.

కంపెనీ వాళ్ళ‌తో క‌లిసి పెయిడ్ ప్ర‌మోష‌న్ చేస్తుంది కాజ‌ల్. అంటే మా డ్రింక్ తాగండి అంటూ కంపెనీతో టై అప్ అయి ప్ర‌చారం చేయ‌డం అన్న‌మాట‌. ప్ర‌స్తుతం వ‌ర‌స సినిమాల్తో బిజీగా ఉన్న కాజ‌ల్.. మ‌ధ్య మ‌ధ్య‌లో ఇలా ప్ర‌మోష‌న్ కూడా చేస్తూ మ‌రింత బిజీ అవుతుంది. ప్ర‌స్తుతం తెలుగులో తెరీ రీమేక్ తో పాటు బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమాలో న‌టిస్తుంది కాజ‌ల్. అన్న‌ట్లు ఈ 7 అప్ కు ఇప్పుడు బ‌న్నీ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నాడు. ఇప్పుడు ఆయ‌న‌కు పోటీగా వ‌స్తుంది కాజ‌ల్.

User Comments