స్వీట్ షాప్ లో ప‌నిచేస్తున్న కాజ‌ల్

Last Updated on by

అదేంటి.. స్టార్ హీరోయిన్ కు అంత క‌ష్టం ఏమొచ్చింది..? ఉన్న‌ట్లుండి స్వీట్ షాప్ లో ఎందుకు ప‌ని చేస్తుంది అనుకుంటున్నారా..? ఏమో మ‌రి కాజ‌ల్ మాత్రం వెళ్లి స్వీట్ షాప్ లోనే ఉంది. అక్క‌డే కొంత సేపు గ‌డిపింది. అంతేకాదు.. కొన్ని చిలిపి పోజులు కూడా ఇచ్చింది ఈ బ్యూటీ. అక్క‌డున్న జాంగ్రీ మొత్తాన్ని తానే తినేస్తున్న‌ట్లు పోజ్ ఇచ్చింది కాజ‌ల్. ఇది చూసి సోష‌ల్ మీడియాలో కామెంట్స్ కూడా బాగానే వ‌స్తున్నాయి.

ఫ‌స్ట్ టైమ్.. ఓ స్వీట్ ఇంకో స్వీట్ ను తింటుంది అంటూ నిన్నుకోరిలో డైలాగ్ ను కాస్త మార్చి పెట్టేసారు. ఇలా ఇంకా బోలెడు కామెంట్స్ వ‌స్తున్నాయి. ఒక్క‌సారి స్వీట్ షాప్ కు వ‌చ్చి ఇక్క‌డ కాజ‌ల్ చేసిన ర‌చ్చ‌కే ఇన్ని కామెంట్స్ వ‌చ్చాయి. ఏదో అలా సర‌దాగా ఓ షాప్ కు వెళ్లిన కాజ‌ల్.. అక్క‌డే కాసేపు ఉండి ఇలాంటి ప‌నులు చేసింది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగులో బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమాతో పాటు ర‌వితేజ తెరీ రీమేక్ లో న‌టించ‌బోతుంది. ఇక క్వీన్ త‌మిళ రీమేక్ లో హీరోయిన్ గా న‌టిస్తుంది.

User Comments