మ‌బ్బుల చాటు చంద‌మామ‌

Last Updated on by

కొన్ని తేనె చుక్క‌లు రంగ‌రించి బ్ర‌హ్మ చెక్కిన శిల్ప ం కాజ‌ల్ అని అందామా? లేదూ వజ్ర‌వైడూర్యాల్ని, కెంపులు-ర‌త్నాల్ని పొదిగి పైవాడు సృష్టించిన జ‌హాప‌నా ఈ చంద‌మామ అని పొగిడేద్దామా? అస‌లేమ‌ని పొగ‌డాలి? న‌వత‌రం గుండెల్లో వీణ‌లు మీటుతున్న ఈ అంద‌గ‌త్తెలో వ‌య‌సు మీరే కొద్దీ అందం పెరుగుతోందే కానీ త‌ర‌గ‌డం లేదు. ఎన్న‌టికీ త‌ర‌గ‌ని శిరుల్ని ఆ గ‌ని నుంచి త‌వ్వుకున్న‌వాళ్ల‌కు త‌వ్వుకున్న ంత అన్న ంత బ్యూటిఫుల్ గా క‌నిపిస్తోంది. మ‌బ్బుల చాటు నుంచి.. చుక్క‌ల్ని ప‌క్క‌కు తోసుకుని భూమ్మీదికి తొంగి చూస్తున్న నెల‌వంక దివ్య రూపం నీది అంటే త‌ప్పే కాదు.

చురుకైన చూపులు.. హుషారెక్కించే శ‌రీరభాష ఈ చంద‌మామను అగ్ర క‌థానాయిక‌ల జాబితాలో చేర్చింది. చంద‌మామ కోస‌మే ప్ర‌త్యేకించి ఈ డిజైన్‌ని రూపొందించారా? అన్న ంత అందంగా కుదిరింది. టాప్ టు బాట‌మ్ ముత్యాలు అద్దిన అంద‌మైన డిజైన‌ర్ డ్రెస్ మైమ‌రిపిస్తుంది. త‌రుణివో.. నీలాల క‌నుల నీలాంబ‌రివో గుండెకు గాయం చేసింది పో. చంద‌మామ కాజ‌ల్ ప్ర‌స్తుతం పారిస్ పారిస్ చిత్రంలో న‌టిస్తోంది. బాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ విజయం అందుకున్న క్వీన్ చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమాతో పాటు భార‌తీయుడు 2లోనూ న‌టిస్తోంద‌న్న వార్త‌లు వైర‌ల్ గా మారాయి.

User Comments