కాజ‌ల్ గురించి తెలిస్తే క‌ళ్ల‌నీళ్లే!

Last Updated on by

అందాల చంద‌మామ కాజ‌ల్ మంచి త‌నం గురించి, సామాజిక సేవా త‌త్ప‌ర‌త గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది త‌క్కువ‌.. తెలియ‌నిది చాలా ఎక్కువ‌. భారీ పారితోషికాలు గుంజుతూ .. త‌న‌కు అవ‌కాశాలిచ్చే టాలీవుడ్‌ను దూరం పెట్టింద‌ని విమ‌ర్శించేవాళ్లున్నారు. అయితే చంద‌మామ‌ కాజ‌ల్ గురించిన‌ కొన్ని నిజాలు తెలిస్తే ఈ మాట అన‌రు. స‌రిక‌దా క‌ళ్లు చెమ‌ర్చ‌డం ఖాయం.

త‌న‌కు అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హించిన టాలీవుడ్‌ని కాజ‌ల్ ఎప్ప‌టికీ వ‌దులుకోదు. అవ‌కాశాలివ్వాలే కానీ టాలీవుడ్ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని ప‌లు సందర్భాల్లో చెప్పింది. అంతేకాదు న‌వ‌త‌రం హీరోలు, స్టార్ హీరోలు అనే విభేధం త‌న‌కు లేదు. కంఫ‌ర్ట్‌ని బ‌ట్టి, టైమింగును బ‌ట్టి న‌టించేస్తుంది అంతే. ఇదో కోణం అనుకుంటే కాజ‌ల్ చాలా కాలంగా త‌న ఎదుగుద‌ల‌కు కార‌ణ‌మైన‌ తెలుగు వాళ్ల కోసం సామాజిక సేవ‌లు చేస్తోంది. ఇక్క‌డ పేదల‌ ఇళ్ల‌లో ఆడ‌పిల్ల‌ల్ని చ‌దివించేందుకు, అనాధ‌ల్ని పోషించేందుకు చాలా సార్లు డొనేష‌న్లు ఇచ్చింది. వీట‌న్నిటికీ మించి మ‌రో గొప్ప సేవాగుణం గురించి ఇటీవ‌లే కాజ‌ల్ స్వ‌యంగా రివీల్ చేసింది. ప్ర‌స్తుతం విశాఖ స‌మీపంలో ఉన్న అర‌కు వ్యాలీలో కాజ‌ల్ ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేసి ఓ గిరిజ‌న పాఠ‌శాలను నిర్మించింది. అందులో చ‌దువుకునే గిరిజ‌న పిల్ల‌లంద‌రికీ చ‌దువు ఉచితం. అడ‌వి త‌ల్లి బిడ్డ‌లే త‌న బిడ్డ‌లుగా భావించి సాకుతోంది. అందుకోసం ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేస్తోంది. ప‌చ్చ‌ని అందాలు, అద్భుత‌మైన వాతావ‌ర‌ణంతో ఉండే అర‌కు అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని చెప్పింది. దీంతో పాటే మ‌రో గుండె ప‌గిలే నిజాన్ని బ‌య‌ట‌కు చెప్పి షాకిచ్చింది చంద‌మామ‌. తాను చాలా కాలంగా `ఆటో ఇమ్యునో డిజార్డ‌ర్‌` (రోగ నిరోధ‌క శ‌క్తిని హ‌రించే) అనే అరుదైన వ్యాధితో బాధ‌ ప‌డుతోంది. 2018 ఆరంభం తాను టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో క‌నిపించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మిదే. ఈ ఏడాది ఆరంభం మూడు నెల‌ల పాటు ఈ రుగ్మ‌త వ‌ల్ల పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకున్నాన‌ని కాజ‌ల్ చెప్పింది. అందాల చంద‌మామ తెర‌వెన‌క బ‌య‌టికి క‌నిపించ‌ని ఎంతో వ్య‌థ‌, క‌ల‌త ఉంద‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

User Comments