చంద‌మామ సొంత ప్రొడ‌క్ష‌న్‌

చంద‌మామ కాజ‌ల్ నిర్మాత అవుతున్నారా? సొంత బ్యాన‌ర్ లో సినిమాలు తీయాల‌ని ఉత్సాహంగా ఉన్నారా? అంటే అవున‌నే తాజా స‌మాచారం. కాజ‌ల్ మైండ్ లో ఆ ఆలోచ‌న ఉండ‌డ‌మే కాదు.. అనుకున్న‌దే త‌డ‌వుగా అమ‌ల్లో పెట్టేస్తున్నార‌ట‌. అ! లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంలో త‌న‌కు అవ‌కాశం ఇచ్చిన యువ‌ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ చెప్పిన ఓ లైన్ ఓకే చెప్పి, వెంట‌నే తాను ఆ చిత్ర‌నిర్మాణానికి రెడీగా ఉన్నాన‌ని కాజ‌ల్ తెలిపార‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమా గురించిన గ్రౌండ్ వ‌ర్క్ న‌డుస్తోంది.

మ‌రోవైపు ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ విష‌య‌మై సీరియ‌స్ గానే క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని తెలుస్తోంది. అ! చిత్రం త‌ర్వాత ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్కి తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లే రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ని రిలీజ్ చేశారు. దానికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. క‌ల్కి పూర్తి చేయ‌గానే కాజ‌ల్ సినిమా విష‌య‌మై ప్ర‌శాంత్ పూర్తి దృష్టి సారిస్తార‌ని తెలుస్తోంది. ఇక‌ కాజ‌ల్ ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న `భార‌తీయుడు 2` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం క‌త్తియుద్ధం, మ‌ర్మ‌క‌ళ, క‌ళ‌రియ‌ప‌ట్టు వంటి విద్య‌ల్ని నేర్చుకుంటోంది. 2.0 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత శంక‌ర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ పాత్ర‌కు చాలా ప్రాధాన్య‌త ఉంటుంద‌ని తెలిసింది. అలాగే ప్ర‌శాంత్ వ‌ర్మ అ! చిత్రంలో త‌న‌ని ఎంతో కొత్త‌గా చూపించాడు. మ‌రోసారి అంత‌కంటే టిఫిక‌ల్ స్క్రీన్ ప్లే ఉన్న క‌థ‌ను కాజ‌ల్ కోసం రెడీ చేశార‌ని తెలుస్తోంది. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ని స‌మాచారం.