అభిన‌వ సీత‌.. ఈవిడ‌ వైఖ‌రి వేరు!

బెల్లంకొండ శ్రీ‌నివాస్ – కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టిస్తున్న సినిమా సీత‌. తేజ ద‌ర్శ‌క‌త్వ ం వ‌హిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అనీల్ సుంక‌ర నిర్మాత‌. సోనూసూద్, మ‌న్నారా చోప్రా కీల‌క పాత్ర‌ధారులు. మ‌హిళా దినోత్సవం సంద‌ర్భ ంగా సీత కొత్త పోస్ట‌ర్ల‌ను లాంచ్ చేసారు. ఏప్రిల్ 25న సినిమా ని రిలీజ్ చేస్తున్నామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

సీత లుక్ డిఫ‌రెంట్. కాజ‌ల్ ఈ చిత్రంలో న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ని బ‌ట్టి కాజ‌ల్ కాస్త యారొగెంట్ సీత‌! అని అర్థ‌మ‌వుతోంది. ఇక సీత‌ ప్రేమ‌లో ఉన్న బెల్లంకొండ ఎలాంటి పాత్ర‌లో న‌టిస్తున్నారు? అన్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో చివ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండ‌గా, శిర్షా రే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. కిషోర్ గ‌రిక‌పాటి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌. అజ‌య్ సుంక‌ర‌, అభిషేక్ అగ‌ర్వాల్ స‌హ‌నిర్మాత‌లుగా కొన‌సాగుతున్నారు. ఫైట్స్ : క‌న‌ల్ క‌ణ్ణ‌న్, ఎడిటింగ్: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు.